Photos Morphing : ఎమ్మెల్యేతో దిగిన ఫోటో మార్ఫింగ్ చేసి…..డబ్బింగ్ చెప్పి..సోషల్ మీడియాలో…

శుభాకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో ఓ మహిళ ఫోటోలు దిగింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసిన మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస

  • Updated on- November 29, 2021 / 01:08 PM IST

Photo Morphing

Photos Morphing : శుభాకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో ఓ మహిళ ఫోటోలు దిగింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసిన మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే…. వెంగళరావు నగర్‌లో ఉండే ఒక వివాహిత మహిళ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బంధువులు వివాహానికి భర్తతో కలిసి హాజరయ్యింది. ఆ వివాహానికి వారి బంధువైన కృష్ణాజిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా హజరయ్యారు. దీంతో వారిద్దరూ పక్కపక్కన కూర్చుని ఫోటోలు దిగారు.
Also Read : TTD OSD : రేపు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు, భౌతికకాయానికి ప్రత్యేక ఇంజక్షన్
ఆఫోటోలు సెల్‌ఫోన్‌లో తీసుకున్న మరి కొందరు … ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరమైన కామెంట్లు జత  చేసి  ఫేస్ బుక్… యూట్యూబ్‌ల్లో  పోస్ట్ చేశారు.  ఆసంగతి తెలుసుకున్న మహిళ  హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్సార్ నగర్ పోలీసులకు బదిలీ చేశారు. పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.