Assault On Dog : ఛీ..ఛీ.. కుక్కనూ వదల్లేదు.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్..

కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. నోరున్న మనుషులనే కాదు నోరు లేని మూగజీవాలను సైతం వదలడం లేదు కొందరు నీచులు.

Assault On Dog

Assault On Dog : కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. నోరున్న మనుషులనే కాదు నోరు లేని మూగజీవాలను సైతం వదలడం లేదు కొందరు నీచులు.

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఉన్మాది.. కుక్కను కూడా వదల్లేదు. ప్రతిరోజు శునకంపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ దారుణం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఫుటేజ్ గమనించిన స్థానికులు నిర్ఘాంతపోయారు. ఆ వెంటనే జంతు హక్కుల కార్యకర్తలకు పంపడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నల్లకుంటలో చోటు చేసుకుంది.

Semaglutide Drug : ప్రపంచానికి గుడ్‌న్యూస్.. అధిక బరువును తగ్గించే సరికొత్త డ్రగ్.. ఇదో గేమ్‌ఛేంజర్..!

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింహ బస్తీలో ఓ వ్యక్తి గత మూడు రోజులుగా ఒక కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇది గమనించిన కొందరు వ్యక్తులు సీసీటీవీ ఫుటేజ్ వీడియోను జంతు హక్కుల కార్యకర్తలకు పంపారు. ఈ వీడియోని చూసి వారు షాక్ తిన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

Instagram New Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. బల్క్ డిలీట్ మెసేజ్‌లు, కామెంట్లు అన్నింటికి ఒకటే..!

తమ దగ్గరున్న వీడియోను నల్లకుంట పోలీసులకు ఇచ్చి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11(A) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

ఈ దారుణం స్థానికులను నిర్ఘాంతపోయేలా చేసింది. జంతు ప్రేమికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మూగజీవి పట్ల అమానుషంగా వ్యవహరించిన ఆ ఉన్మాదిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.