×
Ad

Seema Haider : సీమాహైదర్ ప్రేమ కథలో ముంబయి పోలీసులకు మరో హెచ్చరిక

పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు....

  • Published On : July 14, 2023 / 05:48 AM IST

Seema Haider

Seema Haider love story : పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. కాలర్ ఉర్దూ భాషలో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశాడు. (Mumbai cops get threat of another 26/11)

PM Modi Big Announcements : వర్క్ వీసాలు, కొత్త కాన్సులేట్…ఫ్రాన్సులో మోదీ ప్రకటన

ప్రేమికుడి కోసం పాక్ నుంచి భారతదేశానికి వచ్చిన సీమా హైదర్ తమ దేశానికి తిరిగి రాకపోతే భారతదేశం విధ్వంసం ఎదుర్కొంటుందని కాలర్ హెచ్చరించాడు. (If Seema Haider doesnot return) 26/11 ముంబై ఉగ్రదాడి ఘటన తరహాలో దాడికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, దానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాలర్ తెలిపారు.

PM Modi in Paris : ఫ్రాన్సులో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు

ఈ హెచ్ఛరికపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తరచూ ఇలాంటి కాల్స్ వస్తున్నప్పటికీ, పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్ దేశంలోని సింధ్ ప్రావిన్సుకు చెందిన సీమా హైదర్ 2014లో పాక్ లో వివాహం చేసుకొని కరాచీలో స్థిరపడింది.

Godrej Agrovet: ఆంధ్రా రైతుల కోసం నూతన సమాధాన్ కేంద్రాన్ని ప్రారంభం

అనంతరం పబ్ జి గేమ్ ద్వారా భారత యువకుడైన సచిన్ మీనాతో ప్రేమలో పడి భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చింది. (Sachin and Seema) తన ప్రేమికుడైన సచిన్ ను పెళ్లాడిన సీమా హైదర్ వార్తల్లో నిలిచింది. కాగా తన భార్య, పిల్లలను తమ దేశానికి పంపించాలని సీమా హైదర్ భర్త గులాం హైదర్ భారత ప్రభుత్వాన్ని కోరారు.