×
Ad

Social Media : నగ్నంగా వీడియో కాల్స్-సోషల్ మీడియాలో మహిళలకు వేధింపులు

టెక్నాలజీ పెరిగి ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయే  సరికి ఎంత ఉపయోగం ఉంటోందో  చెడు కూడా అలాగే ఉంటోంది.  సోషల్ మీడియాలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఒక ఐటీ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు.

  • Published On : March 12, 2022 / 06:16 PM IST

It Employee Arrested

Social Media : టెక్నాలజీ పెరిగి ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయే  సరికి ఎంత ఉపయోగం ఉంటోందో  చెడు కూడా అలాగే ఉంటోంది.  సోషల్ మీడియాలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఒక ఐటీ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు.

హైదరాబాద్  సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం…. పాల్వంచ శాస్త్రి రోడ్‌కు చెందిన తాళ్లూరి సాయికృష్ణ అనే యువకుడు హైదరాబాద్‌లోని టీసీఎస్‌ కంపెనీలో అసిస్టెంట్‌ సిస్టమ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.  అతనికి ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియా ఎకౌంట్‌ ఉంది.

ఇటీవల అతని ఇన్‌స్టాగ్రామ్‌‌కు  ఒక మహిళ నుంచి రిక్వెస్ట్‌ వచ్చింది. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ మహిళ అతనికి వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో ఆమె నగ్నంగా అతడితో మాట్లాడింది.  సాయికృష్ణను  కూడా నగ్నంగా  ఉండి  మాట్లాడమని కోరటంతో అతనూ అలాగే ప్రవర్తించాడు.

అప్పటి నుంచి న్యూడ్ కాల్స్ కు బానిసైన సాయికృష్ణ నకిలీ ఇన్‌స్టాగ్రాం ఎకౌంట్స్ ఓపెన్ చేశాడు. మహిళల పేరుతో ఉన్న ఐడీలను   వెతికి వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు వీడియోలు పంపేవాడు.
Also Read : Bhogapuram : స్కూల్ నుంచి సస్పెండ్ చేశారని మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య
ఇదే తరహాలో ఒక మహిళను ఇబ్బందులకు గురిచేయగా ఆ మహిళ రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.