Khammam : కోదాడకు చెందిన యువకుడు ఖమ్మంలో ఆత్మహత్య

సూర్యాపేట  జిల్లా కోదాడకు చెందిన యువకుడు ఖమ్మంలోని బాయ్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం నెహ్రూనగర్‌లో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్‌లో సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రం శాంతి‌నగర్‌

Kodada Young Man Hanging In Khammam

Khammam :  సూర్యాపేట  జిల్లా కోదాడకు చెందిన యువకుడు ఖమ్మంలోని బాయ్స్ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం నెహ్రూనగర్‌లో ఉన్న ఓ బాయ్స్ హాస్టల్‌లో సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రం శాంతి‌నగర్‌కు చెందిన అల్లిక వేణు(22) అనే యువకుడు అనుమానాస్పదంగా  మృతి చెందాడు.

హాస్టల్ యాజమాన్యం ఇచ్చిన వివరాల ప్రకారం గత మూడు రోజులుగా వేణు పెయింగ్   గెస్ట్‌గా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఇవాళ (బుధవారం) చివరి రోజు కావడం… హాస్టల్ విడిచి వెళ్లిపోవాల్సి ఉండగా ఉదయం డబ్బులు చెల్లించాడు.
Also Read : Students Clash : పదవ తరగతి విద్యార్ధుల మధ్య ఘర్షణ-ఒకరి మృతి
అనంతరం   బ్రేక్ ఫాస్ట్ చేసి రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకున్నట్లు తెలిపారు. హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీస్‌లు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హైదరాబాదులో ఉంటూ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్న వేణు ఖమ్మం ఎందుకు వచ్చాడు.. ? ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నాడు అనే విషయాలు మిస్టరీ గా మారాయి..? పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.