Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు
టీవీ సౌండు విషయంలో అత్తాకోడళ్ళు గొడవపడ్డారు. చివరకు కోడలు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త కుడి చేతి మూడు వేళ్ళను కొరికేసింది ఓ కోడలు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లా అంబర్ నాథ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శివాజీ నగర్ పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు.
- T Venkateshwarlu
- Updated on- September 7, 2022 / 03:23 PM IST
Woman bites fingers
Woman bites fingers: టీవీ సౌండు విషయంలో అత్తాకోడళ్ళు గొడవపడ్డారు. చివరకు కోడలు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త కుడి చేతి మూడు వేళ్ళను కొరికేసింది ఓ కోడలు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లా అంబర్ నాథ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శివాజీ నగర్ పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు.
వృశాలీ కులకర్ణి (60) అనే మహిళ ఇంట్లో భజన చేసుకుంటోంది. ఆ సమయంలో ఆమె కోడలు విజయ కులకర్ణి (32) టీవీ చూస్తోంది. తాను భజన చేసుకుంటున్నానని, టీవీ సౌండు తగ్గించాలని వృశాలి తన కోడలిని అడిగింది. అయితే, కోడలు సౌండు తగ్గించకపోవడంతో వృశాలి టీవీ ఆఫ్ చేసింది. కోపోద్రిక్తురాలైన కోడలు విజయ కులకర్ణి అత్త చేతిని లాగి మూడు వేళ్ళను కొరికేసింది.
అంతేకాదు, మధ్యలో జోక్యం చేసుకున్న భర్త చెంపచెళ్లుమనిపించింది. అత్త మూడు చేతి వేళ్ళు తెగిపోలేదని రక్తం వచ్చిందని పోలీసులు వివరించారు. కోడలు విజయ కులకర్ణిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
