Malayalam TV Actor : నిద్ర మాత్రలు మింగి, చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన నటుడు
మలయాళ బుల్లితెర నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం తన కారులో కూర్చున్న సమయంలో చేతి నరాలు కట్ చేసుకుని అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు.
- murthy
- Published On : April 27, 2021 / 12:41 PM IST
Malayalam Tv Actor Adithya Jayan
Malayalam TV Actor : మలయాళ బుల్లితెర నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం తన కారులో కూర్చున్న సమయంలో చేతి నరాలు కట్ చేసుకుని అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్ధితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బుల్లి తెర నటీ నటులైన ఆదిత్యజయన్, అంబిలీ దేవి సీత అనే సీరియల్ లో భార్య భర్తలుగా నటించారు. ఆ షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకుని ఒకింటి వారయ్యారు. వీరికి అర్జున్ అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా భార్యా భర్తల మధ్య విబేధాలు వచ్చాయి. తన భర్త ఆదిత్య జయన్ మీద అంబిలీ దేవి తీవ్ర ఆరోపణలు చేశారు.
అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల ఆమె మీడియా ముందు పలు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఆదిత్య తనకు విడాకులివ్వాలని బలవంతం పెడుతున్నాడని, చంపడానికి కూడా వెనకాడనని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. కాగా అంబిలి దేవి చేసిన ఆరోపణలను ఆదిత్య జయన్ ఖండించాడు. వ్యక్తిగత విబేధాలను దృష్టిలో పెట్టుకుని ఆరోపణలు చేయవద్దని..తన ప్రతిష్టను దిగజార్చవద్దని కోరారు.
ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్నసమయంలోనే ఆదిత్యజయన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఆదివారం ఆత్మహత్యచేసుకోటానికి ముందు ఆదిత్య తీవ్ర స్ధాయిలో నిద్రమాత్రలు వేసుకున్నారని.. అనతంరం ఆయన చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి ఆందోళన కరంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆదిత్య ప్రస్తుతం ఎంటె మాతపు, సీతాకళ్యాణం సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.
