×
Ad

Manipur Women Viral Video : నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే…

మణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్‌పూర్‌లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా ముందు గుర్తు చేసుకున్నారు....

  • Published On : July 21, 2023 / 06:18 AM IST

Manipur Horror

Manipur Women Viral Video : మణిపూర్ రాష్ట్రంలో మే 4వతేదీన జరిగిన దారుణ ఘటనపై బాధిత మహిళ షాకింగ్ వాస్తవాలు బయటపెట్టారు. ప్రస్థుతం చురచంద్‌పూర్‌లోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్న 40 ఏళ్ల బాధిత మహిళ తనకు ఎదురైన కష్టాలను మీడియా ముందు గుర్తు చేసుకున్నారు. (Manipur Woman)

ప్రాణాలు కాపాడుకోవడానికి అడవిలోకి పారిపోయాం…

మే3వతేదీన మెయితీలకు ఎస్టీ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఘటనను వ్యతిరేకిస్తూ మణిపూర్ ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ మెయితీ, కుకీ వర్గాల మధ్య ఆగ్రహాన్ని మరింత పెంచింది. గ్రామాల్లో మెయితీ గుంపులు ఇళ్లను తగులబెడుతుండటంతో తాము ప్రాణాలు కాపాడుకోవడానికి తప్పించుకొని అడవిలోకి పారిపోయామని బాధిత మహిళ చెప్పారు. బాధిత మహిళ 4వతేదీ ఉదయం తన నలుగురు పిల్లలను కాంగ్‌పోక్పి జిల్లాలోని తన గ్రామానికి చాలా దూరంలో ఉన్న నాగా గ్రామంలో ఆశ్రయం పొందేందుకు పంపింది. తాను, తన భర్త మరో 8 మంది అడవిలో దాక్కున్నామని, కానీ మెయితీ గుంపు తమను అడ్డగించి తనతోపాటు మరో మహిళ, సోదరుడు, తండ్రిని మెయిన్ రోడ్డు వైపు తీసుకువెళ్లారని బాధితురాలు కన్నీళ్లతో నాటి దారుణ ఘటనను గుర్తు చేసుకుంది.

నాటి అమానుష ఘటన గురించి బాధిత మహిళ ఏం చెప్పిందంటే…

మెయితీ గుంపులోని కొందరు వ్యక్తులు మా ఇద్దరు మహిళలు బట్టలు విప్పకుంటే చంపేస్తామని బెదిరించారు. మా వస్తువులన్నింటిని తగులబెట్టి, మమ్మల్ని ప్రధాన రోడ్డు వైపు లాక్కెళ్లారు. మా మహిళల బట్టలు చింపి, మా వక్షోజాలను పట్టుకున్నారు. నాతోపాటు ఉన్న మరో మహిళ రోడ్డుపై ఉన్న పోలీసు జీపులో దాక్కున్నా బలవంతంగా ఆమెను లాక్కొచ్చారు. (Punched, Groped And Paraded Naked) పోలీసు జీపులో ఇద్దు పోలీసులు, డ్రైవర్ ఉన్నా వారు మాకు ఎలాంటి సహాయం చేయలేదు.

ఇద్దరిని చంపి కాల్వలో పడేశారు…

మెయితీ గుంపు ఆగడాలను అడ్డుకోబోయిన నా తోటి యువతి తండ్రి, సోదరుడిని కొట్టి, చంపి వారి మృతదేహాలను కాల్వలో పడేశారు. గుంపులో కొందరు తమతో బలవంతంగా బట్టలు విప్పించి రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి లాక్కెళ్లారు. మేం ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారు.

వేడుకున్నా కనికరం చూపలేదు…

మేం రక్షించుకోవడానికి గుంపులో జనం ఏం చెబితే అది చేశాం…నన్ను విడిచిపెట్టమని వారిని వేడుకున్నా, తల్లినని చెప్పినా వారు కనికరం చూపించలేదు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (Manipur Women Viral Video) ఈ సంఘటన మొత్తాన్ని గుంపులోని ఎవరో రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది.