Rajasthan Priest Rape
Priest Rape on Relative : పెళ్లై నలుగురు పిల్లల్లున్న గుడిపూజారి(36), భక్తురాలైన బంధువుకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన రాజస్ధాన్‌లో చోటు చేసుకుంది. జైచంద్‌పూర్ గ్రామంలో నివసించే మహిళ భర్త, తండ్రితో కలిసి గత ఆదివారం తమ బంధువు అర్చకుడిగా పని చేసే గుడికి వెళ్ళింది. దేవుడికి పూజ చేయాలని చెప్పి మహిళ తండ్రి, భర్తను పుజారి ఇంటికి పంపేశాడు. వారు వెళ్లిపోగానే మహిళకు మత్తు మందిచ్చిఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరుసటిరోజు ఉదయం తన కారులోనే నిందితుడి మహిళను ఆమె ఇంటి వద్ద దింపాడు. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పటంతో వారి సాయంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కోసం పోలీసులు అల్వార్, సికార్‌యాడ్ గ్రామాల్లో గాలింపు చేపట్టారు.
సికార్ గ్రామ సమీపంలో నిందితుడి కారు లభించింది…. కానీ నిందితుడి సమచారం దొరకలేదు. మహిళపై అత్యాచారం అనంతరం భయంతో నింగితుడు ఊరి చివర కొండపైన ఉన్న చిన్నగుడిలో తలదాచుకున్నాడు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు కొండపై దాక్కున నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత కేసు దర్యాప్తు ముమ్మరం చేపడతామని పోలీసులు చెప్పారు.