Sahasra Murder Case: కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో వీడిన మిస్టరీ.. పక్కింటి పిల్లాడే హంతకుడు.. ఎందుకు మర్డర్ చేశాడంటే..
బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.

Sahasra Murder Case: హైదరాబాద్ లో సంచలనం రేపిన కూకట్ పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసలు చేధించారు. పదో తరగతి చదువుతున్న వెంకట్ అనే బాలుడు బాలికను హత్య చేసినట్టు గుర్తించారు. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో బాలుడు ఉంటున్నాడు.
బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.
దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలి.. అంతా పేపర్ మీద రాసుకున్నాడు..
”బాలుడు దొంగతనం కోసం వచ్చాడు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఇంట్లో దేవుడు దగ్గర ఉన్న హుండీ పగలకొట్టడానికి బాలుడు యత్నించాడు.
ఇంట్లో చొరబడి 80వేలు దొంగతనం చేశాడు. అదే సమయంలో ఆ అబ్బాయిని సహస్ర చూసేసింది.
దీంతో బాలుడు సహస్ర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బతకకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు.
ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని మరీ అమలు చేశాడు.
దొంగతనం ఎలా చేయాలో పేపర్ లో రాసుకున్నాడు. ఇంగ్లీష్ లో దొంగతనం గురించి రాసుకున్నాడు.
పక్క బిల్డింగ్ నుండి సహస్ర ఇంట్లోకి బాలుడు వచ్చాడు” అని పోలీసులు వెల్లడించారు.
Also Read: బీకేర్ ఫుల్.. ఒక్క వాట్సాప్ కాల్‌తో.. 7లక్షలు కొట్టేశారు.. 81ఏళ్ల వృద్ధుడిని ఇలా మోసం చేశారు..
5 రోజుల క్రితం సహస్ర తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అసలేం జరిగింది, బాలికను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది మిస్టరీగా మారింది.
బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన వైనం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన వారిని భయాందోళనకు గురి చేసింది.
ఈ కేసుని పోలీసులు సవాల్ గా తీసుకుని దర్యాఫ్తు చేశారు.
కూకట్ పల్లిలో రేణుక, కృష్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. పెద్ద కూతురు సహస్ర. కృష్ణ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రేణుక ల్యాబ్ టెక్నీషియన్. రోజూలానే వారు తమ తమ పనులకు వెళ్లిపోయారు.
మధ్యాహ్నం తండ్రి భోజనం కోసం ఇంటికి వచ్చేసరికి కుమార్తె నెత్తుటి మడుగులో పడి ఉండటం చూసి షాక్ కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కాగా, స్కూల్ కి సెలవు కావడంతో సహస్ర ఇంట్లోనే ఉండిపోయిందని తల్లిదండ్రులు చెప్పారు.