Hasini : మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన మిస్ తెలంగాణ.. కారణం అదేనా?

మిస్ తెలంగాణ 2018 విన్నర్ హాసిని(21) మరోసారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పై నుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు యత్నించింది.

Hasini

Hasini : మిస్ తెలంగాణ 2018 విన్నర్ హాసిని(21) మరోసారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పై నుంచి మున్నేరులో దూకి హాసిని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను రక్షించి నందిగామ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స చేస్తున్నారు.

హాసిని సూసైడ్ అటెంప్ట్ చేయడం ఇది రెండోసారి. ఇటీవల ఇన్ స్టాలో లైవ్ పెట్టి ఆత్మహత్యాయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడారు.

IRCTC అకౌంట్ పాస్‌వర్డ్ మరిచిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి!

కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్‌ హాసిని ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం. హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న హాసిని.. బుధవారం(అక్టోబర్ 27,2021) రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ ప్రారంభించకముందే తన స్నేహితుడుకి తాను చనిపోతున్న విషయాన్ని ఫోన్‌లో తెలిపింది. ఫ్లాట్‌ తలుపులు తెరిచి ఉంచి బెడ్రూంలోని తన చున్నీతో ఫ్యాన్‌కు ముడి వేసింది. చిన్న స్టూల్‌ వేసుకుని ఏడుస్తూ తన ఇన్‌స్టా ఐడీలో లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్యకు యత్నించింది.

ఈ లోపు జగిత్యాలలో నివాసం ఉండే హాసిని ఫ్రెండ్‌ షన్నూ డయల్‌ 100కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పి అడ్రస్‌ తెలిపాడు. జాయింట్‌ సీపీ, నార్త్‌జోన్‌ డీసీపీ రమేశ్‌రెడ్డి సమాచారం అందుకున్నారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు చెప్పడంతో వారు హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉన్న హాసినిని హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ వచ్చి తమ సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడకు హాసినిని తీసుకెళ్లారు. ఇంతలోనే మరోసారి ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

Puneeth Rajkumar : అదేపనిగా జిమ్ చేస్తున్నారా? పునీత్ గుండెపోటుకు కారణం ఏంటి?

హాసిని 2018లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన పోటీలో ‘మిస్‌ తెలంగాణ’గా ఎంపికైంది. ఆత్మహత్య తప్పని తెలిసినా తప్పడం లేదని, మన్నించండని వీడియో కాల్ లో వాపోయింది. తనను మానసికంగా వేధించారని, ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియోలో తెలిపింది.

”నాకేదో చెప్పాలనిపిస్తోంది.. చెప్పలేకపోతున్నా. మమ్మీ, డాడీ క్షమించండి ఇలా చెప్పకుండా చేస్తున్నందుకు.. నాకు ఏమీ అవసరం లేదు. నాకిక ఓపిక లేదు.. యాసిడ్‌ అటాక్‌ ఫేస్‌ చేశా.. రేప్‌ ఇష్యూ ఫేస్‌ చేశా.. పబ్లిక్‌ నుంచి వచ్చే కామెంట్స్‌ ఫేస్‌ చేశా.. మా అమ్మకు అందరూ కాల్స్‌ చేస్తున్నారు. నాకు అవసరం లేదు. ఇన్ని డేస్‌ నాకు జరిగిన ఘనకార్యాలు, పురస్కారాలు చాలు. నేను నిజంగా చనిపోవాలి అనుకుంటున్నా’ అంటూ ఇన్‌స్టా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది హాసిని. కాగా, ఆమె ఇలా చేయడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా కారణం అని తెలుస్తోంది.