Actress Murder: గన్నీ బ్యాగ్ లో బంగ్లాదేశ్ నటి మృతదేహం
బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము మిస్సింగ్ ఘటన విషాదంతం అయింది. గత రెండు రోజులుగా రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ ఆ దేశ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
- Bharath Reddy
- Published On : January 19, 2022 / 11:18 AM IST
Acteree
Actress Murder: బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము మిస్సింగ్ ఘటన విషాదంతం అయింది. గత రెండు రోజులుగా రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ ఆ దేశ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఘటనపై నటి తరుపు బంధువుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో సోమవారం దేశ రాజధాని ఢాకాలోని కడమ్‌తోలి ప్రాంతంలో అలీపూర్ బ్రిడ్జి వద్ద ఒక గన్నీ బ్యాగ్ లో రైమా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కెరానిగంజ్ ప్రాంతంలో ఒక సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అందులో రైమా ఇస్లాం మృతదేహాన్ని గుర్తించారు.
Also read: Kuwait Heat: సుసంపన్న దేశం “కువైట్”లో భానుడి భగభగలు, వలస కూలీల పరిస్థితి దారుణం
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని SSMC ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఘటనపై విచారణ చేపట్టారు. నటి మరణంపై ముందు నుంచి ఆమె భర్త షాఖావత్ అలీను అనుమానిస్తున్న పోలీసులు మంగళవారం అతన్ని, అతని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. రైమా శరీరంపై కత్తిపోట్లు, ఇతర గాయాలను గుర్తించిన పోలీసులు, ఆమెను కిరాయి హంతకులు హతమార్చి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: India Corona: ఒక్కరోజులో దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు
కాగా 1998లో “బర్తమాన్” అనే చిత్రం ద్వారా సినీ ప్రవేశం చేసిన రైమా ఇస్లాం, జాతీయ స్థాయిలో 25 పైగా చిత్రాల్లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. పలు బంగ్లా సీరియళ్ళలోనూ నటించిన రైమా, మరికొన్నిటికి నిర్మాతగానూ వ్యవహరించారు. రైమా ఇస్లాం హత్య వెనుక ఆస్తి, నగదు లావాదేవీ వ్యవహారాలు ఉండి ఉంటాయని కేసు దర్యాప్తు చేస్తున్న కాలాబగన్ పోలీసులు భావిస్తున్నారు.
Also read: Indian Navy: ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో పేలుడు, ముగ్గురు మృతి 11 మందికి గాయాలు
