దారుణం: పోర్న్ చేసేందుకు కూతురిని హింసించిన తల్లి

  • Publish Date - March 10, 2019 / 10:59 AM IST

సభ్య సమాజం తల దించుకునే సంఘటన ఇది. తల్లి అనే మాటకు మచ్చ  తెచ్చిన ఘటన అది. 37ఏళ్ల మహిళ చేసిన అమానుష చర్యకు 11ఏళ్ల శిక్షను విధించింది కోర్టు. కంటికి రెప్పలా కూతురిని కాపాడుకోవల్సిన తల్లి విచక్షణ మరిచిపోయి తన మూడేళ్ల కూతురిపై అతి దారుణంగా ప్రవర్తించింది. ఉగాండాకు చెందిన మహిళ తన మూడేళ్ల చిన్నారి జననేంద్రియాన్ని కత్తిరించింది. పుట్టినప్పటి నుంచి చిన్నారితో అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చిత్రీకరించిన ఆమె బాలిక ఐడెంటీటీ స్పష్టంగా కనిపించడం కోసం జననేంద్రియాన్ని కత్తెరతో కత్తిరించింది. తల్లి చేసిన ఈ దారుణ చర్య కారణంగా బాలికకు తీవ్రమైన రక్తస్రావం కావడంతో వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే ఎలా గాయపడిందని డాక్టర్లు అడిగితే… యాక్సిడెంటల్‌గా కత్తి మీద పడిందని చెప్పింది. గాయం జరిగిన తీరు చూసి అనుమానం వచ్చిన వైద్యులు చికిత్స ప్రారంభించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా తల్లి చేసిన చెత్త పని బయటపడింది. అయితే తాను చిన్నారి జననాంగాన్ని కత్తిరించినట్టు ఉప్పుకున్న తల్లి.. 2017 ఆగస్టులో జరిగిన ఓ ప్రమాదంలో చిన్నారి గాయపడిందని, ఆ గాయం తగ్గించేందుకే ఈ విధంగా చేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే పోలీసుల విచారణలో అలాంటిదేమీ లేదని తేలింది. చిన్నారికి ఎలాంటి గాయం కాలేదని, తల్లి కావాలనే కూతురిపై అమానుష చర్యకు పాల్పడిందని కనిపెట్టారు.దీంతో ఆ మహిళకు లండన్ సెంట్రల్ క్రిమినల్ కోర్ట్ 11ఏళ్ల శిక్షను విధించింది. అయితే తల్లి చేసిన ఈ చర్య ఆ చిన్నారి తండ్రికి తెలియకపోవడం విశేషం. భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలోనే ఆ తల్లి ఈ దారుణ చర్యకు పాల్పిడినట్లు విచారణలో తెలిసింది.