తనకు లక్కీ నెంబర్ అని సన్నీలియోన్ కారు నెంబర్ వేయించుకున్న వ్యాపారి

Mumbai : Businessman forges porn star Sunny Leone”s car number, Says it was Numerologically lucky number for him : గడిచిన దశాబ్దకాలంగా టెక్నాలజీఎంతపెరిగి వినియోగంలోకి వచ్చిందం అంతే స్ధాయిలో ప్రజల్లో భక్తి,పూజలు,మూఢనమ్మకాల పట్ల నమ్మకం అంతే పెరిగిపోయింది.

ఇటీవల ముంబైకు చెందిన ఒక వ్యాపార వేత్త న్యూమరాలజీ ప్రకారం తనకు కలిసొచ్చే నెంబరు అని చెప్పి ప్రముఖ పోర్న్ స్టార్ బాలీవుడ్ నటి సన్నీలియోన్ కారునెంబరు తన కారుకు వేసుకుని తిరుగుతున్నాడు. ఇది గమనించిన ముంబై ట్రాఫిక్ పోలీసులు అతడి కారును స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశారు. చట్టవిరుధ్దంగా కారు నెంబరు ప్లేటు మార్చినందుకు అతనిపై   ఫోర్జరీ, క్రిమినల్ కేసు కూడ నమోదు చేశారు.

ఇదే తరహాలో ప్రముఖ పారిశ్రామిక్ వేత్త రతన్ టాటా కారునెంబరును ముంబైకు చెందిన మరోక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త తన కారుకువేయించుకుని తిరుగుతున్న ఘటన మరువక ముందే సన్నీలియోన్ కారు నెంబరు ఘటన వెలుగుచూసింది. కొద్ది రోజుల క్రితం ముంబైకు చెందిన గీతాంజలి సమీర్ షా అనే మహిళా తన తెల్లటి బీ.ఎమ్.డబ్ల్యూ. కారుకు రతనాటాటా ఉపయోగించే కారు నెంబరు వేసుకుని తిరిగసాగింది.

రెండు సార్లు ఆ కారు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించటంతో  పోలీసులు ఆ కారుపై చలాన్లు విధించారు.ట్రాఫిక్ పోలీసుల చలానాలుల రతన్ టాటా కు చేరాయి. అవి చూసిన ఆయన ఆశ్చర్యపోయారు.వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మహిళా ను అరెస్ట్ చేశారు. ఆ నెంబరు రతన్ టాటాదని తనకు తెలియదని, కాకపోతే ఆనెంబరు తనకు కలిసొచ్చే నెంబరు అని గీతాంజలి సమీర్ షా చెప్పుకువచ్చింది. పోలీసులు ఆమె పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు