ఫ్రెండ్ షిప్ పేరుతో మోడల్ పై అత్యాచారం
- murthy
- Published On : February 28, 2021 / 02:03 PM IST
Mumbai man raped on model at Delhi five star hotel : దేశ రాజధాని ఢిల్లీలో ఒక మోడల్ పై, ముంబైకు చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో నివసించే మహిళ(22) మోడలింగ్ రంగంలో పనిచేస్తుంది.ఆమెకు ముంబై కి చెందిన ఒక వ్యక్తి(28)తో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహా వేడుకకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చానని ఆమెకు మెసేజ్ పెట్టాడు. తన కుటుంబ సభ్యులను అందరినీ ఒక హోటల్ లో దింపాడు. అనంతర… తన స్నేహితుడి ఇంటి వద్ద కలుద్దామని ఆమెకు మళ్లీ మెసేజ్ పెట్టాడు. అందుకు ఆమె నిరాకరించింది.
దీంతో నిందితుడి తాను ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్నట్లు ఆమెకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వస్తే బ్రేక్ ఫాస్ట్ చేద్దామని ఆహ్వానించాడు. ఆ మహిళ అక్కడకు వెళ్లి అతనితో బ్రేక్ ఫాస్ట్ చేసింది. అనంతరం ఆమెకు మాటలు చెపుతూ ఆమెను ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని హోటల్ గదికి తీసుకు వెళ్లాడు.
అక్కడ హోటల్ గదిలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి దక్షిణ ముంబైకి చెందిన వాడుగా గుర్తించారు. నిందితుడిని పట్టుకోటానికి ఫిబ్రవరి 23న ఒక ప్రత్యేక బృందాన్ని ముంబై పంపినట్లు పోలీసులు తెలిపారు.
