Leaks in parliament : పార్లమెంట్‌లో రాసలీలలు – వీడియోలు వైరల్
- murthy
- Published On : March 23, 2021 / 05:09 PM IST
Parlament Sex Videos Australia
Parliament leaks : ఆస్ట్రేలియా పార్లమెంట్ కామకలాపాలకు అడ్డాగా మారింది. పార్లమెంట్ భవనంలోని పలు కార్యాలయాల్లో జరిగిన రాసలీలల వీడియోలు ఇప్పుడు ఆదేశంలో వైరల్ అవుతున్నాయి. ఈఘటనతో ఆస్ట్రేలియా అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
పార్లమెంట్ సిబ్బంది ఆఫీసుల్లోనే శృంగారలో తేలిపోతున్న సెక్స్ వీడియోలను లీక్ చేసిన ఘటనలో ఇప్పటికే ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. మహిళా ఎంపీ డెస్క్ వద్ద …శృంగారం చేస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కొత్త సెక్స్ వీడియోలపై ప్రధాని స్కాట్ మారిసన్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ఆవీడియోలు దేశప్రతిష్టకు అవమానకరమని ప్రధాని వ్యాఖ్యానించారు. సభను మళ్లీ ఆర్డర్‌లోకి పెట్టాలని, రాజకీయాలను పక్కనపెట్టి సమస్యను గుర్తించాలని సూచించారు.
కొత్త వీడియోలు లీక్ కావడంతో.. ఆస్ట్రేలియా ప్రధానిపై విమర్శలు మరింత పదునెక్కాయి. రక్షణ కార్యాలయంలో పనిచేస్తున్న మాజీ ఉద్యోగిని తనపై లైంగిక దాడి జరిగినట్లు ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ కేసులో రక్షణ మంత్రి క్షమాపణలు కూడా చెప్పారు.
పార్లమెంట్‌లోని ప్రేయర్ రూమ్‌ను ఉద్యోగి టామ్ బెడ్రూమ్‌గా చేసుకున్నారు. అతడితో పాటు ఎంతో మంది సిబ్బంది ఈ విధంగా చేశారు. తోటి సిబ్బందితో పాటు, వారు బయటి నుంచి వేశ్యలను పిలిపించుకుని రాసలీలలు కొనసాగించారని ఆ దేశ ప్రధాన మీడియా కధనాలు ప్రసారం చేసింది.
ఓ మహిళ ఎంపీకి సంబంధించిన క్యాబిన్‌లో ఈ కామ కలాపాలు కొనసాగాయని వార్తా కధనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రాసలీలల కేసులో కేవలం టామ్ పేరు మాత్రమే బయటకు వచ్చింది. మిగతా వారి వివరాలు గోప్యంగా ఉంచారు. త్వరలోనే వారిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు విడుదలైన వీడియోలు 2019 నాటివి. రెండేళ్ల కిందటి వీడియోలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ రాసలీలపై స్కాట్ ప్రభుత్వాన్ని ఖండిస్తున్న నిరసనకారులు మంగళవారం భారీ ప్రదర్శనలు చేపట్టారు. రాజధాని క్యాన్‌బెరాలో వేల సంఖ్యలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మంగళవారం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు.
