Notorious Criminal, Kuldeep Fazza : తప్పించుకున్న నేరస్ధుడిని 72 గంటల్లోనే ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
పలు నేరాలతో సంబంధం ఉన్న గోగా గ్యాంగ్ కు చెందిన కులదీప్ పజ్జా అనే నేరస్ధుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ పోలీసులు ఆదివారం ఉదయం కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే నేరస్ధుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందటం గమనార్హం.
- murthy
- Published On : March 28, 2021 / 06:52 PM IST
Delhi Encounter
Notorious Criminal, Kuldeep Fazza escaped from GTB hospital, died in encounter : పలు నేరాలతో సంబంధం ఉన్న గోగా గ్యాంగ్ కు చెందిన కులదీప్ పజ్జా అనే నేరస్ధుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ పోలీసులు ఆదివారం ఉదయం కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే నేరస్ధుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందటం గమనార్హం.
పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న కులదీప్ మార్చి 25న వైద్యం చేయించుకోటానికి ఢిల్లీలోని జీబీటీ ఆస్పత్రికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడ్ని పట్టుకోటానికి ఆస్పత్రికి వెళ్లారు.
పోలీసులు రావటం గమనించిన కులదీప్ తన ముఠా సభ్యులతో పోలీసుల మీద కారం చల్లి, కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ సమయంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో కులదీప్ గ్యాంగ్ లోని ఓ సభ్యుడు మరణించాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న కులదీప్ రోహిణి ఏరియాలో ఒక ఫ్లాట్ లో తలదాచుకున్నాడు.
పట్టువదలని పోలీసులు అతడ్ని ట్రాక్ చేసి ఈ స్ధావరాన్ని కూడా పసిగట్టారు. ఈసారి పూర్తి స్ధాయి బలగాలతో ఆ బిల్డింగ్ ను చుట్టుముట్టారు. లొంగి పొమ్మని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేసి తప్పించుకు పారిపోవటానికి పోలీసులపై మళ్లీ కాల్పులు జరిపాడు.
పోలీసులు కూడా అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కులదీప్ అక్కడికక్కడే మరణించాడు. గతంలో అరెస్టై జైలు జీవితం అనుభవించినా తన పంధా మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతూనే ఉండటంతో పోలీసులు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చి గాలింపు చేపట్టారు. ఒకసారి తప్పించుకున్నా, 72 గంటల వ్యవధిలో పోలీసుల చేతిలో కన్నుమూశాడు.
