Nurse Grabs Woman Patient : యూపీ ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. మహిళా రోగి జుట్టు పట్టుకుని తోసేసిన నర్సు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళా రోగి పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. మహిళా రోగి జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

nurse grabs woman patient : ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఓ మహిళా రోగి పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు. మహిళా రోగి జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోసింది. వివరాళ్లోకి వెళ్తే.. ఈ నెల 18న మహిళా రోగిని సీతాపూర్ జిల్లా ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ఆమె కుటుంబ సభ్యులు లేని సమయంలో మహిళ పట్ల నర్సు దురుసుగా ప్రవర్తించారు.

ఆమె జుట్టు పట్టుకుని బెడ్‌పైకి తోశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహిళా రోగి పట్ల నర్సు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్ ఆర్కే సింగ్ ఈ చర్యను సమర్థించారు. అర్ధరాత్రి వేళ మహిళా రోగి వింతగా ప్రవర్తించిందని పేర్కొన్నారు.

Operations Fail Three Women Died : ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం..కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్, ముగ్గురు మహిళలు మృతి

దీంతో ఆమెను నియంత్రించేందుకు నర్సులు అలా చేయాల్సి వచ్చిందన్నారు. ఆమెకు ఇంజక్షన్‌ ఇచ్చిన తర్వాత సాధారణ స్థితికి వచ్చిందని చెప్పారు. అనంతరం మహిళను డిశ్చార్జ్‌ చేసినట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు