Tomato Prices : ఇద్దరు పిల్లల్ని తాకట్టు పెట్టి టమటాలు కొనుగోలు చేసిన వ్యక్తి ..

టమాటాల కోసం ఎంతకు దిగిజారుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. టమాటాల కోసం ఓ వ్యక్తి ఏకంగా ఇద్దరు పిల్లల్ని వ్యాపారికి తాకట్టు పెట్టి మరీ కొనుగోలు చేసిన ఘటన టమాటాల అధిక ధరలకు అద్దంపడుతోంది. మరీ ఇంత దారుణమా? అనేలా టమాటాల కోసం ఏకంగా చిన్నపిల్లల్ని ఉపయోగించుకున్నాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

odisha man trick two boys  4kg of tomatoes

odisha man trick  4kg of tomatoes  : దేశంలో ప్రస్తుతం టమాటాలే హాట్ టాపిక్ గా మారాయి. భారీగా పెరిగినపోయిన ధరలు ఏమాత్రం తగ్గటంలేదు.దీంతో టమాటాల చోరీలే కాదు టమాటాలకు నాగుపాముల్ని కాపాలపెట్టిన ఘటనలో వెలుగులోకి వచ్చి షాక్ తగిలేలా చేస్తున్నాయి. టమాటాల ధరల తగ్గాలంటే టమాటాలుకొనటం మానేయండి అంటూ మంత్రి స్థాయిలో ఉన్నవారే ప్రకటించటం మరో విడ్డూరం. ఈ మాటా నిజమేనేమో..కొనేవారు ఉండబట్టే కదా అమ్మకాలు జరుగుతున్నాయి. కొనేవారే లేకపోతే ధరలు తగ్గుతాయేమో మరి. కానీ ఇంత ధర పలుకుతున్నా టమాటాల కొనుగోళ్లు కూడా జోరుగానే సాగుతున్నాయి.

టమాటా లేకపోతే కూర వండలేము..అసలు బతకేలేము అనేలా ఓ వ్యక్తి ఏకంగా తన ఇద్దరు పిల్లలను తాకట్టు పెట్టి మరీ టమాటాలు కొనుగోలు చేసిన షాకింగ్ ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి వ్యాపారి వద్దకొచ్చి నాలుగు కిలోల టమాటాలు కొన్నాడు. కానీ ఇవ్వటానికి డబ్బులు లేవు. దీంతో తన ఇద్దరు పిల్లలను తాకట్టు పెట్టేసి ఎస్కేప్ అయ్యాడు. ఏకంగా టమాటాల కోసం పిల్లల్నే తాకట్టు పెట్టిన ఈ దారుణ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Tamil nadu Court :35 ఏళ్లనాటి కేసు,ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలుశిక్ష, రూ.3.32 కోట్ల జరిమానా

ఒడిశాలోని కటక్‌ నగరంలో శనివారం (జులై29,2023) ఓ వ్యక్తి వాషింగ్ మెషీన్ కొనుగోలు చేశానని.. దాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కూలీలు కావాలని రూ.300లు ఇస్తానని చెప్పి ఇద్దరు పిల్లలను (మైనర్లు)తీసుకువెళ్లాడు. అది నమ్మిన ఆ ఇద్దరు పిల్లలు అతని కూడా వెళ్లారు. సదరు వ్యక్తి దారి మధ్యలో ఛట్రా బజార్‌లో కూరగాయల దుకాణానికి వెళ్లాడు. 4 కిలోల టమాటాలు కొన్నాడు. తరువాత మరో 10కిలోలు కావాలని కానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదని..చెప్పాడు. ఆ మాటలు కూరగాయల వ్యాపారి నమ్మాడు. మరో ఈ నాలుగు కిలోలతపాటు మరో 10కిలోల టమాటాలకు కలిపి డబ్బులు ఒకేసారి ఇస్తానని చెప్పాడు. ముందుగా కొన్న 4 కిలోల టమాటాలు ఇంటి వద్ద ఇచ్చి మొత్త డబ్బులు తీసుకువస్తానని చెప్పాడు. కానీ మొదట్లో సదరు వ్యక్తి నమ్మిన కూరగాయల వ్యాపారి మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తానని చెప్పిన మాటలు నమ్మలేదు.

దీంతో సదరు వ్యక్తి అలా అయితే నా పిల్లలను నీవద్దే ఉంచుతాను..డబ్బులు ఇచ్చి తీసుకెళతాను నమ్మకమేనా కదా..అంటూ కూలి ఇస్తాయని చెప్పి తీసుకొచ్చిన ఇద్దరు పిల్లలను అక్కడే ఉంచుతానని కూరగాయల దుకాణం యజమానికి చెప్పాడు. ఆ ఇద్దరు పిల్లలు అతని పిల్లలే అని నమ్మిన వ్యాపారి సరేనన్నాడు. దీంతో టమాటాలు పట్టుకుని వెళ్లిపోయాడు. కానీ వెళ్లిన వ్యక్తి ఎంత సేపటికీ తిరిగి రాలేదు. దీంతో 2 గంటల తర్వాత అనుమానం వచ్చింది వ్యాపారికి. ఆ ఇద్దరు పిల్లలను మీ నాన్న ఇంకా రాలేదేంటీ? అని ప్రశ్నించాడు. దీంతో పిల్లలు ఇద్దరు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. అతను మా నాన్న కాదు అతను ఎవరో కూడా మాకు తెలియదు…పని ఉంది కూలి ఇస్తాను రమ్మంటే వచ్చామని చెప్పారు. దీంతో కూరగాయల వ్యాపారి షాక్ అయ్యాడు. అతను ఎక్కడుంటాడో తెలుసా? అని అడిగాడు.దానికి వారు ఏమో తెలియదు అతనికి మొదటిసారే చూశాం..వాషింగ్ మిషన్ కొన్నాను కూలికి రమ్మంటే వచ్చామని చెప్పారు. అంతే తాను మోసపోయానని గ్రహించిన వ్యాపారి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు.

Software Engineer Died : అమెరికా నుంచి పాస్ పోర్టు రెన్యూవల్ కోసం వచ్చి.. గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

కాగా ఒడిశాలో కిలో టమాటా ధర రూ.240పైనే పలుకుతోంది. ఇలా టమాటాల గురించి ఎన్నో వింత వింత ఘటనలు ఎప్పుడు వినని ఘటనలు షాకుల మీద షాకులిస్తున్నాయి. తాజాగా ఏకంగా పిల్లలను తాకట్టు పెట్టి నాలుగు కిలోల టమాటాలతో ఉడాయించిన వ్యక్తి ఘటన మరో హాట్ టాపిక్ గా మారింది.