బ్రిడ్జిపై నుంచి నదిలో పడ్డ కారు.. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

  • Publish Date - February 16, 2020 / 05:53 AM IST

కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కరీంనగర్ నుంచి హైదరాబాద వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. స్వరూప అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరు భార్యభర్తలు అని తెలుస్తోంది. వీరు కొమరవెల్లి జాతరకు దర్శనానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పి ఒక్కసారిగా బ్రిడ్జిపై ఉన్న రేలింగ్ ను ఢీకొని బ్రిడ్జీ పై నుంచి కిందికి పడిపోయింది. నీరు లేకపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించే అవకాశం ఏర్పడింది. శ్రీనివాస్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్వరూపను చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ ఘటనను చూసేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. చంద్రశేఖర్ ప్రమాదవశాత్తు బ్రిడ్జి నుంచి కాలు కింద జారిపడ్డాడు. గాయపడ్డ కానిస్టేబుల్ కూడా వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై ట్రాపిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.  

Read More>> సీసీటీవీ వీడియోలు లీక్: జామియా అల్లర్లలో పోలీసులే విలన్లా!