×
Ad

Eve-Teaser : మహిళపై లైంగిక వేధింపులు… చెప్పుల దండతో నిందితుడ్ని ఊరేగించిన గ్రామస్తులు

రాజస్ధాన్ లో దారుణం జరిగింది. కొందరు యువకులు చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకున్నారు. మహిళను వేధించాడని ఒక వ్యక్తిని ఘోరంగా అవమానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

  • Published On : June 23, 2021 / 05:58 PM IST

Youth Caught 'eve Teasing

Eve-Teaser : రాజస్ధాన్ లో దారుణం జరిగింది. కొందరు యువకులు చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకున్నారు. మహిళను వేధించాడని ఒక వ్యక్తిని ఘోరంగా అవమానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

రాజస్ధాన్, భిల్వారా కు సమీపంలోని థాలియో క ఖేడాలో గత ఆదివారం మహిళ ఇంట్లో ఒంటిరిగా ఉన్నసమయంలో గ్రామానికి చెందిన యువకుడు ఆమెనుతాకరాని చోట తాకేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమహిళ భయంతో కేకలు వేసింది. కేకలు విని స్ధానికులు అక్కడుకుచేరుకున్నారు. ఆయువకుడిని పట్టుకున్నారు.

గతంలోనూ ఆ యువకుడు గ్రామంలోని ఇతర మహిళలపట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులు వచ్చాయి. నిందితుడి ప్రవర్తనతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

యువకుడి మొఖానికి నల్లరంగు పూశారు. మెడలో చెప్పుల దండ వేశారు. అతడ్ని గ్రామం మొత్తం ఊరేగిస్తూ అతడిపై మూత్రం పోశారు. ఈఘటన కొందరు గ్రామస్తులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది.

కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని స్ధానిక పోలీసులు తెలిపారు.ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బనేడా పోలీసుస్టేషన్ కుచెందిన హెడ్ కానిస్టేబుల్ మంగీలాల్ జాట్ తెలిపారు.