Student Tries To Kill Principal : స్కూల్ నుంచి సస్పెండ్ చేశాడన్న కోపంతో.. ప్రిన్సిపాల్ హత్యకు ప్రయత్నం
తనను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారన్న కోపంతో ఓ టీనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా స్కూల్ ప్రిన్సిపాల్ ని హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడు.
- Naveen
- Published On : December 6, 2021 / 12:39 AM IST
Student Tries To Kill Principal
Student Tries To Kill Principal : తనను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారన్న కోపంతో ఓ టీనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా స్కూల్ ప్రిన్సిపాల్ ని హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడు. రాజస్తాన్ లోని ధోల్పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అతడిని స్కూల్ నుంచి బహిష్కరించారు. గతేడాది ఈ ఘటన జరిగింది. ఏడాది దాటినా ఆ టీనేజర్ మర్చిపోలేదు. నిన్న నేరుగా ప్రిన్సిపాల్ అఫీసులోకి వెళ్లాడు. నాటు తుపాకీని ప్రిన్సిపాల్ తలపై ఎక్కు పెట్టాడు. ఫైరింగ్ చేసేందుకు ట్రై చేశాడు. సమయానికి ట్రిగ్గర్ జామ్ కావడంతో ప్రిన్సిపాల్ బతికిపోయాడు.
Akhanda Fire : అఖండ సినిమా చూస్తుండగా మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రేక్షకులు
రంగంలోకి దిగిన పోలీసులు టీనేజర్ ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. టీనేజర్ తన కజిన్ ను తీసుకెళ్లేందుకు స్కూల్ కి వచ్చాడు. కజిన్ ని ఇంటికి దగ్గర దించేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కూల్ దగ్గరికి వచ్చాడు. నేరుగా ప్రిన్సిపాల్ భగవాన్ త్యాగీ ఆఫీసులోకి వెళ్లాడు. నాటు తుపాకీతో ప్రిన్సిపాల్ ను కాల్చి చంపాలని ట్రై చేశాడు. ట్రిగ్గర్ జామ్ కావడంతో ప్రిన్సిపాల్ ప్రాణాలు దక్కాయని ధోల్పూర్ ఎస్పీ కేసర్ సింగ్ చెప్పారు.
Balakrishna : ANRని ఇమిటేట్ చేసిన బాలయ్య.. ఆహా అంటున్న ఫ్యాన్స్
టీనేజర్ నాటు తుపాకీ ఎక్కు పెట్టి తనను చంపేందుకు ట్రై చేయడంతో ప్రిన్సిపాల్ హడలిపోయాడు. ఆ తర్వాత ఆయన అలార్మ్ మోగించారు. అలార్మ్ శబ్దం విన్న వెంటనే స్కూల్ సిబ్బంది లోపలికి వెళ్లారు. అక్కడి సీన్ చూసి షాక్ తిన్నారు. ఆ వెంటనే టీనేజర్ ను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, టీచర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో ఏడాది క్రితం టీనేజర్ ను స్కూల్ నుంచి బహిష్కరించి టీసీ ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
