అత్యాచారం చేశాడు.. ఆత్మహత్యకు చేసుకున్నాడు!!
- Subhan Ali Shaik
- Updated on- December 31, 2020 / 11:48 AM IST
Rangareddy: ఆవేశంలో చేసిన తప్పులు అయినా ప్రేరేపితంగా చేసిన నేరాలైనా పశ్చాత్తాపం వచ్చేవరకూ శిక్ష అనుభవించాల్సిందే అంటోంది చట్టం. కానీ, ఇక్కడ చేసిన తప్పును తెలుసుకుని తనకు తానుగా శిక్ష వేసుకోవాలని భావించి ఆత్మహత్య చేసుకున్నాడో యువకుడు. రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
శంకర్(22) అనే యువకుడు బోర్ మెకానిక్ గా పనిచేస్తూ… తల్లిదండ్రులతో పాటు నివాసముంటున్నాడు. ఆ ప్రాంతానికే చెందిన ఓ వివాహిత అతణ్ని లిఫ్ట్ అడిగింది. అటుగా వెళ్లాల్సిన వైపుకు కాకుండా రూటు మార్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై బలవంతంగా రేప్ చేశాడు. ఘటన జరిగిన తర్వాత భయంతో అక్కడ నుంచి పరార్ అయ్యాడు.
తనకు జరిగిన దారుణానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఆ మహిళ. ఆ విషయం తెలుసుకున్నాడు శంకర్. అత్యాచారానికి తెగించిన అతడికి భయం మొదలైంది. తాను చేసిన తప్పుకు శిక్షపడుతుందని భయపడ్డాడు. పారిపోయినా పట్టుకుంటారని ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.
కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన మహిళ నేరుగా పోలీసులను శంకర్ ఉండే తమ ప్రాంతానికే తీసుకువస్తుందని తెలుసుకున్నాడు. మరోవైపు నుంచి పరారై ఊరవతల ఉన్న చెట్టుకు ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పోలీసులు వైద్యపరీక్షలకు పంపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
