Reel With Snake: పాముతో రీల్ చేయబోయిన సాధువు.. మెడకు చుట్టుకుని కాట్లు వేయడంతో..
సాధువు పేరు భజరంగి సాధు, వయసు 55 ఏళ్లు. కాన్పూర్ సమీపంలోని ఖేర అనే గ్రామవాసి. చేనేత సౌందర్య సాధనాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. విషయంలోకి వెళ్తే.. సబేదార్ అనే పంక్చర్ షాపులోకి పాము వచ్చింది. ఆ షాపు యజమాని అయిన సుబేదార్ ఆ పామును చంపబోతుంటే భజరంగి అడ్డుకున్నాడు. అనంతరం దాన్ని ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్లాడు. అంతే కాకుండా పామును చంపడం మంచి శకునం కాదని, పాపమని చెప్పాడు.
- tony bekkal
- Published On : September 25, 2022 / 07:20 PM IST
Sadhu poses for reel with snake wrapped around his neck, dies
Reel With Snake: సోషల్ మీడియాలో వైరల్ వీడియోల కోసం రకరకాల స్టంట్లు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వయసు, జెండర్లతో సంబంధం లేకుండా ఈ పిచ్చి అందరినీ ఆవహించింది. తాజాగా ఒక సాధువు సైతం ఇలాంటి స్టంట్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. పాముతో రీల్‌కు ప్రయత్నించగా ఆ పాము మెడకు చుట్టుకుని వరుస కాట్లు వేసింది. విషం శరీరంలోకి ఎక్కడంతో సాధువు మరణించాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. మరణించిన సాధువు పేరు భజరంగి సాధు, వయసు 55 ఏళ్లు. కాన్పూర్ సమీపంలోని ఖేర అనే గ్రామవాసి. చేనేత సౌందర్య సాధనాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. విషయంలోకి వెళ్తే.. సబేదార్ అనే పంక్చర్ షాపులోకి పాము వచ్చింది. ఆ షాపు యజమాని అయిన సుబేదార్ ఆ పామును చంపబోతుంటే భజరంగి అడ్డుకున్నాడు. అనంతరం దాన్ని ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్లాడు. అంతే కాకుండా పామును చంపడం మంచి శకునం కాదని, పాపమని చెప్పాడు.
అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే అలవాటున్న భజరంగీ.. ఈ పాముతో రీల్ చేయాలని అనుకున్నాడు. కొంత మంది ఈ రీల్‌పై ఆసక్తి కనబర్చడంతో వారిని పిలిచి వారి ముందే చేయడానికి ప్రయత్నించాడు. చేతికి చుట్టుకుని, మెడకు చుట్టుకుని రీల్ చేస్తుండగా.. ఆ పాము సాధువు మెడపై పలుమార్లు కాట్లు వేసింది. వెంటనే అతడిని లఖ్‌నవూలోని ఆసపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మరణించాడు.
Resort Murder Case: ప్రాథమిక నివేదిక విడుదల.. అంకిత భండారి మరణానికి గల కారణం ఏంటంటే..?
