Resort Murder Case: ప్రాథమిక నివేదిక విడుదల.. అంకిత భండారి మరణానికి గల కారణం ఏంటంటే..?

19 ఏళ్ల అంకిత భండారీ మృతదేహం రిషీకేష్‌లోని ఒక కెనాల్‌లో కనిపించడం సంచలనమైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యను, అత‌నికి స‌హ‌క‌రించిన రిసార్టు మేనేజ‌ర్‌ను, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రత్యేక సేవల కింద గెస్టులకు ఉపచర్యలు చేసేందుకు అంకిత నిరాకరించదన్న కారణంగానే ఈ దురాగతానికి పాల్పడ్డారనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి.

Resort Murder Case: ప్రాథమిక నివేదిక విడుదల.. అంకిత భండారి మరణానికి గల కారణం ఏంటంటే..?

Ankita Bhandari died due to drowning says preliminary report

Resort Murder Case: ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంకిత భండారి మర్డర్ కేసుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వెల్లడైంది. రిషీకేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టి్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం.. నీటిలో మునగడం వల్లే ఆమె మరణించినట్లు పేర్కొన్నారు. అయితే మృతికి ముందు ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని కూడా తెలిపారు. ఎయిమ్స్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం ఈ పోస్ట్‌మార్టం నిర్వహించింది.

పోస్ట్‌మార్టం తుది నివేదక తమకు అందేంత వరకూ అంకిత అంత్యక్రియలు జరిపేది లేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదకతో తాను సంతృప్తిగా లేనని, తుది నివేదక వచ్చేంత వరకూ అంత్యక్రియలు జరపమని అంకిత తండ్రి వీరేంద్ర సింగ్ భండారి తెలిపారు. ప్రాథమిక నివేదికలో అసల వివరాలు ఏవీ లేవని అంకిత సోదరుడు అజయ్ సింగ్ భండారి అన్నారు. అంకిత పనిచేస్తున్న రిసార్ట్‌ను ఎందుకు కూల్చవేశారని ఆయన నిలదీశారు. సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగానే రిసార్టును కూల్చివేశారని ఆరోపించారు.

19 ఏళ్ల అంకిత భండారీ మృతదేహం రిషీకేష్‌లోని ఒక కెనాల్‌లో కనిపించడం సంచలనమైంది. ఈ కేసులో రిసార్ట్ యజమాని పులకిత్ ఆర్యను, అత‌నికి స‌హ‌క‌రించిన రిసార్టు మేనేజ‌ర్‌ను, అసిస్టెంట్ మేనేజ‌ర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రత్యేక సేవల కింద గెస్టులకు ఉపచర్యలు చేసేందుకు అంకిత నిరాకరించదన్న కారణంగానే ఈ దురాగతానికి పాల్పడ్డారనే అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి.

Rashmika Mandanna: “గుడ్ బై” సినిమా ప్రమోషన్స్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న..

ఇక ఈ కేసులో ప్రధానం నిందితుడైన పులకిత్ ఆర్య అమాయకుడని, నిజానికి అతడిది అలాంటి వ్యక్తిత్వం కాదని.. కొడుకును వెనకేసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ నేత వినోద్ ఆర్య. ఈ విషయమై ఇప్పటికే పులకిత్ ఆర్య అరెస్ట్ కాగా, వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగించారు. ప్రస్తతం ఈ వివాదం ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని రాజకీయంగా కుదిపివేస్తోంది. ఈ నేపథ్యంలో కొడుకు గురించి ప్రశ్నించగా.. అతడు నిర్ధోషని, అమాయకుడని తండ్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

‘‘అలాంటి కార్యకలాపాల్లో పులకిత్ అస్సలు తలదూర్చడు. అతడికి అలాంటివి తెలియవు కూడా. అమాయకుడు అతడు. అందరిలాంటి సాదా సీదా కుర్రాడు. తన పని తప్పితే వేరే ప్రపంచం తెలియదు. నా కొడుకు పులకిత్ ఆర్యతో పాటు అంకిత భండారి కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ కేసుపై విచారణ నిష్పాక్షికంగా, న్యాయంగా జరగాలనే బీజేపీకి రాజీనామా చేశాను. నా కొడుకు అంకిత్ కూడా అందుకే రాజీనామా చేశాడు’’ అని ఆదివారం వినోద్ ఆర్య అన్నారు.

Inside Kuno Park: చీతాలు ఇప్పుడెలా ఉన్నాయి.. ఏం తింటున్నాయి.. అడవిలో ఎప్పుడు వదిలిపెడతారో తెలుసా!

ఇక ఈ కేసులో శనివారం ఓ కీలక విషయం బయటికి వచ్చింది. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయడానికి ఒప్పుకోనందుకే అంకితను హత్య చేసినట్లు వెల్లడైంది. తన స్నేహితులతో అంకిత జరిపిన చాటింగ్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రిసార్టుకు వచ్చే అతిథులతో శృంగారం చేయాలని ఆమెపై యజమాని ఒత్తిడి తీసుకువచ్చాడట. అందుకు ఆమె నిరాకరించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.

ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం లేసింది. రాజకీయంగా అయితే మరింత అగ్గి రగులుతోంది. దీంతో పులకిత్ తండ్రి అయిన వినోద్ ఆర్యను సోదరుడు అంకిత్ ఆర్యను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయమై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. నిందితులు ఎలాంటి వారైనా వదిలేదని లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రిసార్టును బుల్డోజర్లతో కూల్చివేశారు. కొంత మంది స్థానికులు అప్పటికే దానికి నిప్పు పెట్టారు.

INLD Rally: బీజేపీని మిత్రపక్షాలు అందుకే వదిలేస్తున్నాయి.. ప్రతిపక్షాల ర్యాలీలో తేజశ్వీ యాదవ్