Inside Kuno Park: చీతాలు ఇప్పుడెలా ఉన్నాయి.. ఏం తింటున్నాయి.. అడవిలో ఎప్పుడు వదిలిపెడతారో తెలుసా!

మన దేశంలోకి చీతాల్ని తీసుకొచ్చి వారం రోజులు పూర్తయ్యాయి. అయితే, ఇప్పుడు చీతాలు ఎలా ఉన్నాయి? ఏం తింటున్నాయి? వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఇంతకీ వాటిని అడవిలోకి వదిలిపెడతారా?

Inside Kuno Park: చీతాలు ఇప్పుడెలా ఉన్నాయి.. ఏం తింటున్నాయి.. అడవిలో ఎప్పుడు వదిలిపెడతారో తెలుసా!

Inside Kuno Park: నమీబియా నుంచి చీతాల్ని మన దేశం తీసుకొచ్చి వారం రోజులు అయిపోయింది. అధికారులు చీతాలను కునో నేషనల్ పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో ఉంచిన సంగతి తెలిసిందే. వాటిని మన దేశంలోకి వదిలి వారం రోజులైన సందర్భంగా చీతాల పరిస్థితి గురించి తాజాగా అధికారులు కొన్ని విషయాలు వెల్లడించారు.

Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

ప్రస్తుతం చీతాలు క్షేమంగానే ఉన్నాయి. నెమ్మదిగా మన వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. ప్రత్యేక ట్రాకర్లు ఏర్పాటు చేసిన చీతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఐదుగురు వెటర్నరీ వైద్య నిపుణుల బృందం వాటి సంరక్షణ బాధ్యతలు చూస్తోంది. వీరిలో ముగ్గురు నమీబియాకు చెందిన వాళ్లే. చీతాలు ఎన్‌క్లోజర్లలో చుట్టూ ఉత్సాహంగా తిరుగుతున్నాయి. వాటికి అధికారులు గేదె మాంసాన్ని అందిస్తున్నారు. వాటి ఆరోగ్యాన్ని నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాటికి అమర్చిన ట్రాకర్ల ద్వారా హెల్త్ గురించి తెలుసుకుంటున్నారు. వాటి పారామీటర్లు అన్నీ సరిగ్గానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరిస్తున్నారు.

Husband Stabs Wife: బిహార్‌లో దారుణం.. భార్య ఉద్యోగం చేస్తున్నందుకు కత్తితో పొడిచిన భర్త

మొత్తం ఎనిమిది చీతాల్ని నమీబియా నుంచి తీసుకురాగా, వాటిని మొత్తం ఆరు ఎన్‌క్లోజర్లలో ఉంచారు. రెండు ఎన్‌క్లోజర్లలో రెండు చీతాల చొప్పున ఉంచగా, మిగతా నాలుగు ఎన్‌క్లోజర్లలో ఒక్కో చీతాను ఉంచారు. వీటికోసం ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది. టాస్క్‌ఫోర్స్‌లో అటవీ శాఖ అధికారులు, పర్యాటక శాఖ అధికారులు, ఐజీ, వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం చీతాలు క్వారంటైన్‌లో ఉన్నాయి. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడ్డాయి అనుకున్న తర్వాత వీటిని స్వేచ్ఛగా అడవిలోకి వదిలిపెడతారు.