Husband Stabs Wife: బిహార్‌లో దారుణం.. భార్య ఉద్యోగం చేస్తున్నందుకు కత్తితో పొడిచిన భర్త

భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త దారుణానికి తెగించాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Husband Stabs Wife: బిహార్‌లో దారుణం.. భార్య ఉద్యోగం చేస్తున్నందుకు కత్తితో పొడిచిన భర్త

Husband Stabs Wife: భార్య ఉద్యోగం చేయడం ఇష్టంలేని భర్త ఆమెను కత్తితో దారుణంగా పొడిచాడు. ఈ ఘటన బిహార్‌లోని, బెగుసరై ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతా దేవి అనే మహిళ సిర్హౌల్ అనే గ్రామంలోని ఉద్యోగ విహార్‌లో ఉన్న ఒక గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తోంది.

Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత

ఆమెకు కొంతకాలం క్రితం మహేష్ రామ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే, పెళ్లైన తర్వాత నుంచి ఇద్దరి మధ్యా బేధాభిప్రాయాలు వచ్చాయి. సీత ఉద్యోగం చేయడం భర్త మహేష్‌కు ఇష్టం లేదు. ఈ విషయంలో మహేష్ తన భార్యను ఎప్పుడూ వేధించేవాడు. ఉద్యోగం మానేయమని చెప్పేవాడు. దీనికి సీతాదేవి ఒప్పుకోలేదు. అయితే, భర్త వేధింపులు ఎక్కువ కావడంతో ఏడాది నుంచి సీతాదేవి అతడికి దూరంగా వేరేచోట, పాపతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో గత శుక్రవారం మహేష్ రామ్, తన భార్య సీతాదేవి దగ్గరకు వచ్చాడు. తనతో కలిసి ఉండాలని కోరాడు. అయితే, ఉద్యోగం మానేయమన్నాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. ఇది వాగ్వాదానికి దారి తీసింది.

Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

ఈ దశలో కోపానికి గురైన మహేష్ రామ్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె కడుపులో అనేకసార్లు పొడిచాడు. తర్వాత ఛాతిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ దాడిని ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమె చేతికి కూడా గాయాలయ్యాయి. తర్వాత మహేష్ రామ్ అక్కడ్నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సీతా దేవిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతా దేవి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నామని, వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.