Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో రైతులకు అనుకూలంగా కొత్త చట్టం రూపొందించబోతుంది. బ్యాంకు రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయకుండా ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం బొమ్మై ప్రకటించారు.

Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

Karnataka: కర్ణాటక ప్రభుత్వం రైతులకు అనుకూలంగా త్వరలో కొత్త చట్టం రూపొందించబోతుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయకుండా ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై ప్రకటించారు.

Renigunta Fire Accident: రేణిగుంట ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. చిన్నారులు సహా ముగ్గురు మృతి

చిత్రదుర్గలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో బొమ్మై ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా రైతులు తమ భూముల మీద రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ రైతులు వాటిని చెల్లించలేకపోతే, బ్యాంకులు ముందుగా నోటీసులు జారీ చేసి, తర్వాత భూముల్ని స్వాధీనం చేసుకుంటాయి. అయితే, కొత్తగా రూపొందిస్తున్న చట్టం అమల్లోకి వస్తే బ్యాంకులు ఇకపై రైతుల ఆస్తుల్ని జప్తుచేయడం కుదరదు. అలాగే రైతులు రుణాలు తిరిగి సులభ పద్ధతుల్లో చెల్లించేలా వెసలుబాటు కల్పిస్తారు. ఇప్పటికే 14 లక్షల రైతు కుటుంబాలకు చెందిన పిల్లల కోసం విద్యానిధి పథకాన్ని రూపొందించినట్లు, ఇప్పుడా పథకాన్ని రైతు కూలీలు, జాలర్లు, ఆటో రిక్షా కార్మికులు, ట్యాక్సీ డ్రైవర్లు, చేనేత వర్గాలకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు.

Nayanthara: “నయనతార” సౌత్ ఇండియా కాబట్టే పెళ్లి చేసుకున్నా.. డైరెక్టర్ విగ్నేశ్ శివన్ షాకింగ్ కామెంట్స్!

‘‘డబ్బు లేక విద్యార్థుల చదువులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. సాగు నీరు అందిస్తున్నాం. మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. అయితే, ప్రకృతి విపత్తుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు’’ అని బసవరాజు బొమ్మై అన్నారు.