Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత

ఇటీవల హత్యకు గురైన అంకితా భండారి హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను పేదదాన్నే అయినప్పటికీ, డబ్బు కోసం తనను తాను అమ్ముకోలేనని స్నేహితురాలికి మెసేజ్ చేసింది అంకిత.

Ankita Bhandari: పేదదాన్నే.. కానీ పది వేలకు నన్ను నేను అమ్ముకోలేను.. స్నేహితురాలికి మెసేజ్ చేసిన అంకిత

Ankita Bhandari: ఉత్తరాఖండ్‌లో 19 ఏళ్ల అంకితా భండారి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్, పౌరి జిల్లాలో వనంతార రిసార్టులో అంకితా భండారి రిసెప్షనిస్టుగా పని చేసేది.

Renigunta Fire Accident: రేణిగుంట ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. చిన్నారులు సహా ముగ్గురు మృతి

అయితే, అంకితను వ్యభిచారం చేయమని రిసార్ట్ ఓనర్ అయిన పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, మరో వ్యక్తి వేధించారు. చాలా కాలం నుంచి ఆమెను ఈ విషయంలో వేధింపులకు గురిచేశారు. దీనికి ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే అంకితను వాళ్లు హత్య చేశారు. ఈ నెల 18న అంకిత కనిపించకుండా పోయింది. తర్వాత 21న దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణ జరిపిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆమె మృతదేహం స్థానిక కాలువ వద్ద దొరికింది. నిందితులకు సంబంధించిన రిసార్టును అధికారులు కూల్చివేశారు. అంతకుముందే స్థానికులు ఆ రిసార్టును తగలబెట్టారు. కాగా, హత్యకు ముందు అంకిత తన స్నేహితురాలితో చేసిన చాటింగ్ వివరాలు బయటికొచ్చాయి.

Nudity Protection: మహిళల సేఫ్టీ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ ఫీచర్.. డెవలప్ చేస్తున్న ‘మెటా’

‘‘రిసార్టుకు వచ్చే కస్టమర్లకు ‘ప్రత్యేక సర్వీసులు’ అందించాలంటూ రిసార్టు ఓనర్, మేనేజర్ నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను పేదదాన్నే కావొచ్చు. కానీ, పది వేల రూపాయల కోసం నన్ను నేను అమ్ముకోలేను’’ అని అంకిత తన స్నేహితురాలికి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. నిందితులు ఎలాంటివారైనా వదిలేది లేదన్నారు. నిందితుడి తండ్రి బీజేపీకి చెందిన నేత కావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.