Nudity Protection: మహిళల సేఫ్టీ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ ఫీచర్.. డెవలప్ చేస్తున్న ‘మెటా’

మహిళలు, యూజర్ల సేఫ్టీ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్ రూపొందిస్తోంది. ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు అసభ్యకరమైన, న్యూడ్ ఫొటోలు తమ చాట్‌లో కనిపించకుండా చేయవచ్చు.

Nudity Protection: మహిళల సేఫ్టీ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ ఫీచర్.. డెవలప్ చేస్తున్న ‘మెటా’

Nudity Protection: యూజర్ల కోసం.. ముఖ్యంగా మహిళల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. ‘న్యూడిటీ ప్రొటెక్షన్ పేరుతో’ ఒక కొత్త ఫీచర్ రూపొందిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ ‘మెటా’ వెల్లడించింది.

Renigunta Fire Accident: రేణిగుంట ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. చిన్నారులు సహా ముగ్గురు మృతి

ఇది మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. డైరెక్ట్ చాట్ మెసేజెస్‌లో న్యూడ్ ఫొటోలు రాకుండా చేయడమే ఈ ఫీచర్. సోషల్ మీడియా సైబర్ వేధింపులకు అడ్డాగా మారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పర్సనల్‌గా న్యూడ్ ఫొటోలు పంపి వేధిస్తుంటారు. అయితే, ఇలాంటి ఫొటోలు కనిపించకుండా చేస్తుంది ‘న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్’. ఇది గత ఏడాది ప్రవేశపెట్టిన ‘హిడెన్ వర్డ్స్’ లాంటి ఫీచరే. గతంలో వచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు అభ్యంతరకరంగా ఉన్న వర్డ్స్ చాట్‌లో తమకు కనిపించకుండా చేసుకోవచ్చు.

Karnataka: రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయడం కుదరదు.. కొత్త చట్టం తేనున్న కర్ణాటక

ఇతరులు అసభ్య పదజాలం వాడినా అది వారికి కనిపించదు. త్వరలో రానున్న కొత్త ఫీచర్ ద్వారా కూడా ఎవరైనా అభ్యంతరకరమైన, న్యూడిటీ ఉన్న ఫొటోలు పంపినా కనిపించవు. యూజర్లకు ఈ విషయంలో కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. చాట్‌లో న్యూడ్ ఫొటోలు కనిపించకుండా ఉండేలా టెక్నాలజీ డెవలప్ చేయడంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవడం ద్వారా యూజర్లు తమకు న్యూడ్ ఫొటోలు రాకుండా నియంత్రించుకోవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ మరికొద్ది వారాల్లో అందబాటులోకి వచ్చే అవకాశం ఉంది.