Viral Video : రాజకీయ నాయకుడి కారుని ఈడ్చుకెళ్లిన లారీ
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రాజకీయ నాయకుడికి చెందిన కారును, లారీ 500మీటర్ల దూరం లాక్కెళ్ళింది.
- chvmurthy
- Updated on- August 8, 2022 / 09:04 PM IST
UP SP leader car accident
Viral Video : ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రాజకీయ నాయకుడికి చెందిన కారును, లారీ 500మీటర్ల దూరం లాక్కెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ నాయకుడి కారుకు ప్రమాదం జరిగిందనే సరికి దీనిపై పలు ఊహాగానాలు చెలరేగాయి.
సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్రసింగ్ యాదవ్ ఆదివారం రాత్రి మెయిన్పురిలో తన కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆయన కారును ఓ లారీ ఢీకొట్టింది. డ్రైవర్ తన లారీని ఆపకుండా కారును సుమారు అర కిలోమీటర్ దూరం ముందుకు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో మరో బైకు కూడా ప్రమాదానికి గురైంది.
అయితే స్థానికులు లారీని వెంబడించడంతో 500 మీటర్లు ముందుకు వెళ్లిన తర్వాత డ్రైవర్ తన లారీని ఆపాడు. అయితే ఈఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
సమాజ్వాదీ నాయకుని కారును లారీ ఢీకొట్టిందని, 500 మీటర్లకుపైగా దూరం అలాగే తీసుకెళ్లిందని జిల్లా ఎస్పీ కమలేశ్ దిక్షంత్ చెప్పారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేశామని…. ఇది హత్యా యత్నమా లేక ప్రమాద వశాత్తు జరిగిన ఘటనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
