Girl Molestation : దారుణం.. టెన్త్ విద్యార్థినిపై లైంగిక దాడి, పూజకు వెళ్లి తిరిగొస్తుండగా కిరాతకం

Minor Girl Molestation : ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జైలుకి తరలించారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Girl Molestation : దారుణం.. టెన్త్ విద్యార్థినిపై లైంగిక దాడి, పూజకు వెళ్లి తిరిగొస్తుండగా కిరాతకం

Minor Girl Molestation (Photo : Google)

ఆడపిల్లకు రక్షణ కరువైంది. కఠినమైన చట్టాలు తెస్తున్నా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంతో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు వ్యక్తులు కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థిని తన కుటుంబసభ్యులతో కలిసి చాట్ పూజా చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు బాలికను అడ్డగించారు. కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఎత్తుకెళ్లారు. బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు.

Also Read : దెందులూరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఆత్మహత్య కేసులో భార్య, అత్తమామలు అరెస్ట్

బాలిక కనిపించకుండా పోయే సరికి కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. బాలిక ఆచూకీ కోసం వెతికారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో వారికి బాలిక కనిపించింది. బాలికను తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే, రక్తస్రావం ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. మెరుగైన వైద్య చికిత్స కోసం బాలికను పెద్దాసుపత్రికి తరలించారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జైలుకి తరలించారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.