AP Crime: దెందులూరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఆత్మహత్య కేసులో భార్య, అత్తమామలు అరెస్ట్

తేజామూర్తి ఐదు నెలల క్రితమే ప్రియాంక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్‌లోనే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పలు కారణాలతో భార్యపై..

AP Crime: దెందులూరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఆత్మహత్య కేసులో భార్య, అత్తమామలు అరెస్ట్

సెప్టెంబర్ 4వ తేదీన దెందులూరు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ తేజమూర్తి కేసులో ఐదుగురిపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అతడి భార్య నాగ ప్రియాంక, అత్తమామలు కూడా ఉన్నారు. వీరిని ప్రస్తుతం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీసీపీ అశోక్ కుమార్ తెలిపారు.

ప్రేమ వివాహం చేసుకున్న తేజ మూర్తి, నాగ ప్రియాంకల మధ్య మనస్పర్ధలను నాగ ప్రియాంక తల్లిదండ్రులు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రేమ వివాహం నాగ ప్రియాంక తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఇది ముదిరి ఇంత వరకు వచ్చిందని, మృతుడు తేజమూర్తి తల్లికి అన్ని విధాల న్యాయం జరిగే విధంగా చట్టపరమైన చర్యలు చేపడతామని డీసీపీ ఆశోక్ కూమార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?

హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో పనిచేసే తేజామూర్తి అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి సెప్టెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవలు చెలరేగడం, ఈ విషయంలో పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజామూర్తి లేఖ రాశాడు. పోలీసుల వేధింపుల వల్లే తేజామూర్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యతో ఉన్న గొడవలపై పోలీస్ స్టేషన్‌కి వెళితే అతడికి న్యాయం చేయకపోగా వేధించారని అన్నారు. పోలీసుల వేధింపులపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని బంధువులు డిమాండ్ చేశారు.

తేజామూర్తి ఐదు నెలల క్రితమే ప్రియాంక అనే యువతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్‌లోనే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. పలు కారణాలతో భార్యపై తేజామూర్తి చేయిచేసుకున్నాడు. తనను కొట్టడంతో ఏలూరు వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో ప్రియాంక కేసు పెట్టింది. రాజకీయ నాయకుల ఒత్తిడితో తేజామూర్తిపై పోలీసులు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారట. సెటిల్మెంట్‌కు రాకపోతే కేసు పెడతామని, అరెస్టు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 8 పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయి తేజామూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఏపీ ఫైబర్‭నెట్ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి