Young Man Stabbed Young Woman : పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని కత్తితో పొడిచి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
మధ్యప్రదేశ్ ఖంద్వా జిల్లాలో దారుణం జరిగింది. యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన యువతిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు.
- bheemraj
- Published On : August 31, 2022 / 08:11 PM IST
young man stabbed young woman
Young Man Stabbed Young Woman : మధ్యప్రదేశ్ ఖంద్వా జిల్లాలో దారుణం జరిగింది. యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖంద్వా జిల్లాలోని ఓ గ్రామంలో బబ్లూ అనే యువకుడు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
బబ్లూ పని చేసే ప్రాంతానికి సమీపంలోనే 20 ఏళ్ల యువతి తన కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో గత సోమవారం యువతి తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. బాధితురాలు, ఆమె అక్క మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో అక్కచెళ్లెలు ఇద్దరూ బకెట్లతో ఇంట్లోకి నీళ్లు మోస్తున్నారు.
Warangal: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై దాడి..
గమనించిన వాచ్‌మెన్ బబ్లూ.. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో యువతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సదరు యువతి అక్క నీళ్ల బకెట్‌తో ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనుకాలే వెళ్తున్న చెల్లిపై బబ్లూ కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెను కత్తితో పొడిచాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయి సమీపంలోని ఇందిరా సాగర్ డ్యామ్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన యువతిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. అయినా ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొన్నారు.
