Married Woman Escaped 7th Class Boy
Uttar Pradesh : three children Mother absconding with Seventh class student in Gorakhpur : ప్రేమ గుడ్డిది అంటారు. నా ప్రేమను నాకళ్లతో చూడు నీకళ్ళతో కాదు అని అప్పుడప్పుడు ప్రేమికులుడైలాగులు కూడా వేస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది ఒకొసారి.
ఉత్తర ప్రదేశ్, గోరఖ్ పూర్ లో అలాంటి ఘోరమే జరిగింది. 7వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడ్డ ముగ్గురు పిల్లల తల్లి కుర్రాడ్ని తీసుకుని పారిపోయింది.
గోరఖ్ పూర్ లోని క్యాంపియర్ గంజ్ ప్రాంతంలో నివసించే ముగ్గురు పిల్లల వివాహిత అదే ప్రాంతంలో 7వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడితో చనువుగా ఉండేది. వారిద్దరూ స్నేహంగా ఉంటున్న విషయం ఊరందరికీ తెలిసినప్పటికీ వారి బంధం గురించి ఎవరూ తప్పుగా ఆలోచించలేదు.
కానీ మార్చి10వ తేదీరాత్రి వాళ్లిద్దరూ పిల్లలనువదిలేసి ఊరు వదిలి పారిపోయారు. ఈ వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించి కలకలం రేపింది. గ్రామస్తులు ఊరంతా వెదికారు అయినా వారి ఆచూకి తెలుసుకోలేక పోయారు. పక్క గ్రామాల్లో విచారించారు. అయినా వారి జాడ తెలియలేదు. దీంతో బాలుడి తల్లితండ్రులు పోలీసులకుఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.