ఈశాన్య ఢిల్లీలోని ఖాజురి ఖాస్ ప్రాంతంలో దారుణం జరిగింది. హరియాణాకు చెందిన మహిళా డ్యాన్సర్ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదురోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.
ఈశాన్య ఢిల్లీలోని ఖాజురి ఖాస్ ప్రాంతంలో దారుణం జరిగింది. హరియాణాకు చెందిన మహిళా డ్యాన్సర్ పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదురోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణా నుంచి 20ఏళ్ల మహిళా డ్యాన్సర్ డ్యాన్స్ షో కోసం ఢిల్లీకి వచ్చింది.
Read Also : ఓటు వేయండి : పెట్రోల్, డీజిల్ పై 50 పైసలు డిస్కాంట్ పొందండి
ఈ క్రమంలో కాష్మెర్ గేట్ ఐఎస్ బీటీ దగ్గర బస్సు దిగింది. అక్కడ డ్యాన్సర్ ను కారులో ముగ్గురు వ్యక్తులు పికప్ చేసుకున్నారు. డ్యాన్స్ షో జరిగే వేదిక దగ్గర డ్రాప్ చేస్తామంటూ నమ్మబలికి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
కారు ఎక్కించుకుని జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి మహిళపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అత్యాచారం అనంతరం డ్యాన్సర్ ను ఖాజూరి చౌక్ లో దింపేసి ఆమె ఫోన్ ను తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.
నిందితులు ముగ్గురిలో లోకేశ్ (21), ఓమ్ (25), హృషికేష్ (25)గా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Also : కోయంబత్తూరు లో 149 కేజీల బంగారం స్వాధీనం :ఎన్నికల తనిఖీలు