×
Ad

Three Terrorists Killed : జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ ద్రాస్‌ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

  • Published On : October 5, 2022 / 01:23 PM IST

Three Terrorists Killed

Three terrorists killed : జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ ద్రాస్‌ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారని ఏడీజీపీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఉగ్రవాదులు హసన్‌ బిన్‌ యాకూబ్‌, జంషెడ్‌ హతమయ్యారు. ఈ నెల 2న పుల్వామాలోని పింగలానాలో ఎస్పీఓ జావేద్‌ దార్‌, సెప్టెంబర్‌ 24న పుల్వామాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీని హత్య చేసిన వీరిద్దరు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

jammu kashmir Encounter : జమ్ము కశ్మీర్ ఎన్ కౌంటర్ లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు హతం

అదే సమయంలో ములులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.