Wife Takes Life : గుండెలు పిండే విషాదం.. గుండెపోటుతో భర్త మృతి, 7వ ఫ్లోర్ నుంచి దూకి భార్య ఆత్యహత్య

నవ దంపతుల అకాల మరణం తీవ్ర విషాదం నింపింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు.

Wife Takes Life

Wife Takes Life : ఇది గుండెలు పిండే విషాదం. హృదయాలను బరువెక్కించే బాధాకర ఘటన. గుండెపోటుతో భర చనిపోగా, ఆ బాధ తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు తీసుకుంది. బతికున్నప్పుడే కాదు.. మరణంలోనూ భర్త వెంటే వెళ్లింది. కంటతడి పెట్టించే ఈ హృదయవిదారక ఘటన ఢిల్లీ ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.

ఢిల్లీకి చెందిన అభిషేక్(25), అంజలి గత నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు. నిన్న ఇద్దరూ కలిసి జూకి వెళ్లారు. అదే సమయంలో అభిషేక్ కి సడెన్ గా గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ చనిపోయాడు. భర్త మరణాన్ని అంజలి తట్టుకోలేకపోయింది. షాక్ కి గురైంది. భర్తను తలుచుకుని రాత్రంతా రోదించింది. ఆ తర్వాత ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ అపార్ట్ మెంట్ లో 7వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 24 గంటల వ్యవధిలో నవ దంపతుల అకాల మరణం తీవ్ర విషాదం నింపింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు.

అభిషేక్ అహ్లువాలి, అంజలి గతేడాది నవంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సరదాగా సాగిపోతున్న వారి జీవితంలో అంతులేని విషాదం అలుముకుంది. ఢిల్లీలోని జూ చూసేందుకు ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. జూకి వెళ్లారు. అయితే, అనుకోని విధంగా అక్కడ అభిషేక్ కి ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో వెంటనే అతడిని బహదూర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. అభిషేక్ చనిపోయాడు.

అభిషేక్ మృతదేహాన్ని రాత్రి 9గంటల సమయంలో ఘజియాబాద్ లో అతడు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కి తీసుకెళ్లారు. భర్త హఠానర్మణంతో భార్య అంజలి తట్టుకోలేకపోయింది. రాత్రంతా ఏడ్చింది. ఇదే క్రమంలో 7వ ఫోర్ బాల్కనీ నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన అంజలిని బంధువులు వెంనటే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజలి కూడా మరణించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు