Medchal : మేడ్చల్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును డివైడర్ ఎక్కింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు...

  • Published On : March 2, 2022 / 06:40 AM IST

Accident

Road Accident In Medchal : అతివేగం ప్రమాదకరం.. రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. దీని కారణంగా నిండు జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. మేడ్చల్ చెక్ పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును డివైడర్ ఎక్కింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారులో 9 మంది ఉన్నారు.

Read More : Telangana Corona: తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు

రామాయంపేట నుంచి నగరానికి ఓ కారు వస్తోంది. అందులో 9 మంది ఉన్నారు. అత్యంత వేగంగా వస్తుండడంతో కారు అదుపు తప్పింది. దీంతో బావర్చీ హోటల్ ముందు డివైడర్ ఢీకొంది. కారులో ఉన్న తొమ్మిది మందిలో ఇద్దరు చనిపోయారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి..గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ TS 07 GK 7291 గుర్తించారు. మృతులు మధ్య ప్రదేశ్ కి చెందిన‌ గోరా సింగ్, బిబ్బు సింగ్ లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.