Illegal Affair : వావి వరసలు మరిచి….కోడలితో మామ వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధాల మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ.  అడ్డుగా ఉన్నాడని కొడుకును హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

Illegal Affair

Illegal Affair : వివాహేతర సంబంధాల మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ.  అడ్డుగా ఉన్నాడని కొడుకును హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

సంతమాగులూరు మండలం ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్య, కొడుకు లక్ష్మయ్య (35) కోడలు సునీతతో కాపురం ఉంటున్నాడు. కరుణయ్య భార్య మరియమ్మ 30 ఏళ్ల క్రితమే చనిపోయింది. మద్యానికి బానిసైన లక్ష్మయ్య మద్యం మత్తులోఉండేవాడు. ఈక్రమంలో మామ కరుణయ్య, కోడలు సునీత మధ్య అక్రమం సంబంధం ఏర్పడింది.

తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని లక్ష్మయ్యను హత మార్చేందుకు మామ, కోడలు ప్లాన్ వేశారు. పధకం ప్రకారం ఆదివారం రాత్రి నిద్రపోతున్న లక్ష్మయ్యపై మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. వీరు హత్య చేస్తున్నప్పుడు మృతుడి  పెద్ద కొడుకు ఈ దారుణాన్ని కళ్లారా చూశాడు. అతని ద్వారా ఈ విషయం బయటపడింది.పోలీసులు నిందుతులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.