బాయ్ ‌ఫ్రెండ్ కలుద్దామంటే నో అందని.. స్నేహితుడితో కలిసి బాలికపై గ్యాంగ్ రేప్.. హత్య!

  • Publish Date - October 21, 2020 / 07:24 PM IST

UP Minor Gang Rape : బాయ్ ఫ్రెండ్ కలుద్దామంటే వద్దు అన్నందుకు 17ఏళ్ల బాలికను తన స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. ఆపై హత్యకు పాల్పడ్డాడో ప్రియుడు. ఈ ఘటన యూపీలోని బరబంకి జిల్లాలోని లక్నో రాజధాని నుంచి 30 కిలోమీటర్ల దూరంలో జరిగింది.



మృతురాలి కుటుంబం మాత్రం వారిద్దరి ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టు యూపీ పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి బాధితురాలు కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. తాను ఒకరితో రిలేషన్ షిప్‌లో ఉందనే సమాచారంతో పోలీసులు ఆ వ్యక్తిని ఇంటరాగేట్ చేయడంతో హత్యచేసిన విషయాన్ని అంగీకరించాడు.



పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు నిందితులు బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని కాలువలో పడేసినట్టు పోలీసుల విచారణలో బయటపెట్టారు. అత్యాచారం చేశాక బాలికను కాలువలోకి విసిరేశారు. కాలువలో బాలిక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చామని మృతురాలి సోదరుడు మీడియాకు వెల్లడించాడు.



బాలికపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై గ్యాంగ్ రేప్, హత్య కేసులను నమోదు చేశారు. మరో ఘటనలో 14ఏళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీకి 45 కిలోమీటర్ల దూరంలో జరిగిందని యూపీలోని హపూర్ పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు.