UP woman cop goes missing: ముస్లిం యువకుడితో మహిళా ఎస్.ఐ. పెళ్లికి యత్నం…ఆపై అదృశ్యం

ఓ ముస్లిం వ్యాపారవేత్తను వివాహం చేసుకునేందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన మహిళా సబ్‌ఇన్ స్పెక్టర్ అదృశ్యం అయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది....

మతాంతర వివాహానికి దరఖాస్తు చేసిన ఎస్ఐ అదృశ్యం

UP woman cop goes missing: ఓ ముస్లిం వ్యాపారవేత్తను వివాహం చేసుకునేందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన మహిళా సబ్‌ఇన్ స్పెక్టర్ అదృశ్యం అయిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ప్రత్యేక వివాహ చట్టం కింద ముస్లిం వ్యాపారిని వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ సుభాష్ నగర్ మహిళా పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు చేశారు.(after interfaith marriage)అనంతరం ఈ వార్త వార్తాపత్రికలు,సోషల్ మీడియాలో వచ్చిన కొద్ది గంటల్లోనే మహిళా ఎస్.ఐ.శుక్రవారం సాయంత్రం విధుల నుంచి అదృశ్యమయ్యారు.

Japan Road Acident: జపాన్ లో బస్సు, ట్రక్కు ఢీ, ఐదుగురి మృతి

తన సోదరి ముస్లిం వ్యాపారితో గత కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉందని, తన సోదరిని ముస్లిం వ్యాపారి బ్రెయిన్ వాష్ చేశారని పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ ప్రేమ్ చంద్ మీనాకు ఫిర్యాదు చేశారు.ముస్లిం వ్యాపారి తన సోదరితో ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నాడని, మతాంతర వివాహం నుంచి తన సోదరిని రక్షించడానికి ఆమెను బిజ్నోర్ లేదా షామ్లీ పట్టణాలకు బదిలీ చేయాలని యువతి సోదరుడు పోలీసు అధికారులను కోరారు.

Cyclone Biparjoy Brings Heavy Rain: రాజస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు, నలుగురి మృతి

గతంలో బరేలీలోని బహేరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించినప్పుడు ముస్లిం వ్యాపారిని మహిళా ఎస్ఐ కలిశారని పోలీసులు తెలిపారు. మహిళా ఎస్.ఐ. అదృశ్యంపై తాము జనరల్ డైరీలో ఎంట్రీ నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కాగా గత నెలలో ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం తాము వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. మతాంతర వివాహం తర్వాత తమ మతం మారబోమని లిఖితపూర్వకంగా వారు తెలిపారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఇద్దరి కుటుంబసభ్యులకు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ నోటీసులు పంపించారు.

Mass Shooting At Music Festival: యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో కాల్పులు, ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు

కాగా మహిళా ఎస్ఐ, ముస్లిం వ్యాపారి ఇద్దరూ పెద్దలు కావడంతో బలవంతం చేసి పెళ్లి చేసుకోవడం లేదని, వీరి పెళ్లికి న్యాయపరమైన అడ్డంకులు లేవని పోలీసు అధికారులు చెబుతున్నారు. మొత్తంమీద హిందూ మతానికి చెందిన మహిళా ఎస్ఐ ముస్లిం వ్యాపారిని పెళ్లాడబోవడం, అనంతరం అదృశ్యం అయిన ఉదంతాలు యూపీలో చర్చనీయాంశంగా మారాయి.