Gang Rape
Vijayawada Police Arrested : వివాహితపై అత్యాచారం చేస్తున్న భర్తను అడ్డుకోవాల్సిన భార్య.. దారుణానికి ఒడిగట్టింది. అతడికి సహకరించి.. వీడియో తీసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఏపీ రాష్ట్రంలోని విజయవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అజిత్ సింగ్ నగర్ లో ఓ వివాహిత, భర్త కేటరింగ్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎదురింట్లో దిలీప్, తులసీ భార్య భర్తలు ఉంటున్నారు. ఈనెల 3వ తేదీ రాత్రి ఆమె తన ఇధ్దరు పిల్లలతో కలిసి నిద్రపోతోంది. రాత్రి 11గంటలకు బాధితురాలి ఇంట్లోకి చొరబడిన దిలీప్, తులసి అనే చొరబడ్డారు.
Read More : Shanmukh jaswanth : షణ్ముఖ్ జస్వంత్ గృహ ప్రవేశం
అనంతరం మహిళ నోరు మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు సార్లు అత్యాచారం చేయగా భార్య వీడియో, ఫొటోలు తీసింది. తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లల్ని చంపేస్తానని, ఫొటోలను అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా తన స్నేహితుల కోరిక తీర్చాలని బెదిరిస్తుండడంతో దిశ పోలీస్‌స్టేషన్‌ను బాధితురాలు ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన లో భార్యా భర్తలపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.