Viral Video : రాంగ్ రూట్ లోవచ్చిన కారు-అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అరకిలోమీటరు ఈడ్చుకెళ్లిన డ్రైవర్
రాంగ్ రూట్ లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఒక వ్యక్తి అరకిలోమీటర్ దూరం కారు బానెట్ పై లాక్కెళ్ళిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
- chvmurthy
- Published on- July 11, 2022 / 05:28 PM IST
Mumbai Cop Viral Video
Viral Video : రాంగ్ రూట్ లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఒక వ్యక్తి అరకిలోమీటర్ దూరం కారు బానెట్ పై లాక్కెళ్ళిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వెనుక కారులో వస్తున్న వ్యక్తి ఈ ఘటననను వీడియో తీస్తూ ఆ కారుకు అడ్డం పెట్టటంతో కానిస్టేబుల్ ప్రమాదం నుంచి బతికి బయట పడ్డాడు.
వివరాల్లోకి వెళితే ముంబైలోని ఖర్ఘర్ సెక్టార్ 8 లో నివాసం ఉండే ఆకాష్ జంగీర్ (28) వృత్తి రీత్యా ఇంజనీర్. ఈనెల 9వ తేదీ శనివారం ఉదయం ఖర్ఘర్ లోని సియోన్-పన్వెల్ హైవే సమీపంలోని కోప్రా వంతెన వద్ద జంగీర్ కారులో వెళుతున్నాడు. అక్కడ అతను రాంగ్ రూట్ లో ప్రయాణించాడు. అది గమనించిన అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నామ్ దేవ్ గడేకర్ (32) కారును ఆపేందుకు ప్రయత్నించాడు.
అయిత్ జంగీర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వసాగాడు. కానిస్టేబుల్ గడేకర్ కారు ముందుకు వచ్చి కారుకు అడ్డంగా నిలబడ్డాడు. అయినా జంగీర్ కారు ఆపకుండా కానిస్టేబుల్ మీదుగా దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసాడు. వెంటనే గడేకర్ కారు బానెట్ ను పట్టుకుని దానిపై ప్రమాదకరంగా వేలాడాడు.
అప్రమత్తమైన మరోక కానిస్టేబుల్ ఒకరి బైక్ పై ఎక్కి కారును వెంబడించసాగాడు. జంగీర్ వెనుక కారులో వస్తున్న మరోక వ్యక్తి వేగంగా తన కారును ముందుకు పోనిచ్చి అడ్డంపెట్టటంతో జంగీర్ కారు ఆపి కానిస్టేబుల్ ను కాపాడాడు. కారులోని వ్యక్తి ఈ ద్యుశ్యాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. జంగీర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
