Police Constable Video Viral : పట్టపగలు పోలీసు గ్రౌండ్‌లో మద్యం సేవించిన పోలీసు వీడియో వైరల్
నిబంధనలు అమలు చేసేది ప్రజల కోసమే కానీ మా కోసం కాదన్నట్టు ఉంది ఈ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తన.
- chvmurthy
- Published On : October 18, 2021 / 11:58 AM IST
Police Constable Video Viral
Police Constable Video Viral : నిబంధనలు అమలు చేసేది ప్రజల కోసమే కానీ మా కోసం కాదన్నట్టు ఉంది ఈ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తన. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏఆర్ పోలీసు గ్రౌండ్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్ బహిరంగంగా మద్యం సేవిస్తూ వీడియో కెమెరాకు చిక్కాడు. అందుకు సంబధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవలే కొత్తగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఐశ్వర్య రస్తోగి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే మందుబాబులపై కేసులు పెడుతూ జరిమానాలు విధిస్తున్నారు. కానీ పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఒక ఏ ఆర్ కానిస్టేబుల్ ఏఆర్ పోలీసు గ్రౌండ్ లోనే మద్యం సేవించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Husband Eloped : పెళ్లైన నాలుగు నెలలకే ఇల్లు వదిలి పారిపోయిన భర్త
ఈ కానిస్టేబుల్ రాజమహేంద్రవరానికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అని ఆ వీడియోలో పేర్కోన్నారు. కానీ… ఇతను ఎక్కడ పని చేస్తున్నాడు, ఏవింగ్ లో పనిచేస్తున్నాడనే పూర్తి విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.
Police Constable Video Viral
