గుండెలు అదిరిపోయే రోడ్డు ప్రమాదం..! కారుతో గుద్దితే గాల్లోకి ఎలా ఎగిరిపడ్డారో చూడండి..

ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.

Viral Video : మీరు ఇంతవరకు చాలా యాక్సిడెంట్లు చూసి ఉంటారు. అందులో కొన్ని చాలా భయానకంగా ఉంటాయి. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటాయి. వామ్మో.. అని అనకుండా ఉండలేదు. తాజాగా అలాంటి రోడ్ యాక్సిడెంట్ ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఆ యాక్సిడెంట్ ను చూసినోళ్లు బిత్తరపోతున్నారు.

మహారాష్ట్రంలోని కొల్హాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన కారు 4 బైక్స్ ను ఢీకొట్టింది. ఆ కారు ఎంత వేగంగా వచ్చిందంటే.. బైక్ లపై ప్రయాణిస్తున్న వ్యక్తులు గాల్లోకి ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తో ఇద్దరు బైకర్లు స్పాట్ లోనే మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ కారుని నడిపింది ఓ 72ఏళ్ల వృద్ధుడు.

ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాక్సిడెంట్ జరిగిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. అంతా రెప్పపాటులోనే ఈ దారుణం జరిగింది. ఇక కళ్లారా ప్రమాదాన్ని చూసినోళ్లకు ముచ్చెమటలు పట్టాయి. వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డవారు ప్రాణ భయంతో హడలిపోయారు.

ఈ యాక్సిడెంట్ కు సంబంధించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రమాదానికి కారణమైన కారుని నడిపింది ఎవరో తెలుసా? 72 ఏళ్ల వృద్ధుడు. ఆయన తన హ్యుందాయ్ సాంత్రో నడుపుతూ ఇంతటి అనర్ధానికి కారణం అయ్యాడు. అదో కూడలి. అక్కడ వాహనాల రద్దీ ఉంది. అటు ఇటు వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం బిజీగా ఉంది. ఇంతలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. రోడ్డు క్రాస్ చేస్తున్న నాలుగు బైకులను బలంగా ఢీకొట్టింది. అంతేకాదు రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ వాహనాన్ని కూడా గుద్దింది. అక్కడితో ఆగింది. కొల్హాపూర్ లోని సైబర్ చౌక్ ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది.

కారు నడిపిన వృద్ధుడు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన పేరు వసంత్ చవాన్. శివాజీ యూనివర్సిటీలో ప్రో వైస్ చాన్సలర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. జూన్ 1వ తేదీన ఆయనకు 72ఏళ్లు వచ్చాయి. కొల్హాపూర్ సిటీలో సైబర్ చౌక్ కూడలిలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉండవు. దాంతో వాహనదారులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వెళ్తుంటారు. సరిగ్గా 2.23 గంటల సమయంలో మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు 4 బైకులను ఢీకొట్టింది. దీంతో వాటిపై ఉన్న వ్యక్తులు అమాంతం గాల్లోకి ఎగిరిపడ్డారు. కాగా, కారు నడిపిన వృద్ధుడికి ఆరోగ్యం బాగోలేదని, కారు వేగాన్ని ఆయన నియంత్రించలేకపోయారని పోలీసుల దర్యాఫ్తులో గుర్తించారు.

సినిమాల్లో చూపించే స్టంట్స్ తరహాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వాయు వేగంగా కారు దూసుకురావడం, మనుషులు గాల్లోకి ఎగరడం, స్పాట్ లోనే ప్రాణాలు పోవడం.. అన్నీ రెప్పపాటులోనే జరిగిపోయాయి.

Also Read : వాటర్ ట్యాంక్‌లో శవం, 10రోజులుగా ఆ నీళ్లనే తాగుతున్న జనం..! నల్గొండలో ఘోరం

ట్రెండింగ్ వార్తలు