Husband Cheating Wife : ప్రేమ, పెళ్లి పేరుతో గర్భవతిని చేసి పారిపోయిన భర్త
ప్రేమ పేరుతో ఒకయువతి వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో ప్రబుధ్దుడు. పెళ్లి చేసుకోమనే సరికి మాటమార్చాడు.
- chvmurthy
- Published On : October 25, 2021 / 10:44 AM IST
Wife Protest
Husband Cheating Wife : ప్రేమ పేరుతో ఒకయువతి వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో ప్రబుధ్దుడు. పెళ్లి చేసుకోమనే సరికి మాటమార్చాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని 10 రోజులు భార్యతో ఉండి పరారైన భర్త కోసం విజయనగరం జిల్లాలో ఓ వివాహిత పోరాటం చేస్తోంది.
చీపురుపల్లి లోని డైలీ మార్కెట్ ఏరియాకు చెందిన నందన అనే యువతిని, ఆమె ఇంటి ఎదురుగా నివసించే నర్రు చినబాబు అనే వ్యక్తి రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అతని మాటలు నమ్మి ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సన్నిహితంగా మెలిగి ఆమెను గర్బవతిని చేశాడు.
పెళ్లి చేసుకోమని నందన కోరే సరికి కులాలు వేరంటూ… ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటంలేదని చెప్పి తప్పించుకో చూశాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. అక్కడ చర్చల అనంతరం ఈ ఏడాది జూన్ 20న అమ్మవారి ఆలయంలో ఆమె మెడలో మూడు ముళ్లు వేసి వివాహం చేసుకున్నాడు.
Also Read : Murder Attempt On Wife : కాపురానికి రావట్లేదని భార్యపై హత్యాయత్నం
తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవటంతో చినబాబు తల్లితండ్రులు వారిద్దరినీ ఇంట్లోకి రానీయలేదు. దీంతో కొత్త దంపతులు కొత్తగౌడ వీధిలో ఉన్న వందన అన్నయ్య ఇంటిలో నివాసం ఉన్నారు. జూన్ 30న ఇంటి నుంచి వెళ్లిన భర్త ఇంత వరకూ తిరిగి రాలేదని… అత్తమామలే ఎక్కడో దాచి పెట్టారని ఆరోపిస్తూ వందన ఆదివారం అత్తమామల ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా తమ కుమారుడు ఎక్కడున్నాడో తమకు తెలియదని చినబాబు తల్లి తండ్రులు చెపుతున్నారు. చినబాబు అంశంపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్ధానిక ఎస్సై సన్యాసినాయుడు వివరించారు.
