Woman and her gang robbed man : లిఫ్టు కావాలని బైక్ ఎక్కి.. దోపిడీ చేసిన మహిళ

అర్జంట్ గా ఆస్పత్రికి వెళ్లాలి స్నేహితురాలి  డెలివరీకి డబ్బులు అందచేయాలి..లిఫ్ట్ ఇవ్వమని అడిగిన యువతి కొంతదూరం వెళ్లాక సదరు వ్యక్తిని స్నేహితులతో కలిసి దోచుకున్న  ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Karnataka Woman and her gang robbed man after he gives lift :  అర్జంట్ గా ఆస్పత్రికి వెళ్లాలి స్నేహితురాలి  డెలివరీకి డబ్బులు అందచేయాలి..లిఫ్ట్ ఇవ్వమని అడిగిన యువతి కొంతదూరం వెళ్లాక సదరు వ్యక్తిని స్నేహితులతో కలిసి దోచుకున్న  ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం జిల్లాలో దొడ్డ తాలూకాలో ఇసుక వ్యాపారం చేసే నంజేగౌడ(51) సమీప గ్రామలలో  తిరిగి ఇసుక సప్లై చేసి సాయంత్రానికి తిరిగి స్వగ్రామానికి వెళుతుంటాడు. వ్యాపారంలో భాగంగా అతని వద్ద ఎప్పుడూ జేబులో డబ్బులు ఉంటాయి.

మార్చి 26న ఇసుక వ్యాపారం పనులు చూసుకుని డబ్బులు వసూలు చేసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు.  ఈ క్రమంలో నంజేగౌడ పట్టణంలోని ఏపీఎంసీ మార్కెట్ నుంచి బైక్ పై బయలు దేరాడు. కొంత దూరం వచ్చే సరికిఒక మహిళ చేయి ఊపి లిఫ్ట్ కావాలని అడిగింది.

తన స్నేహితురాలికి ఆస్పత్రిలో డెలివరీ జరుగుతోందని….. అర్జంట్ గా ఆమెకు డబ్బులు ఇవ్వాలని, ఆస్పత్రి సమీపంలోని ఘాట్ రోడ్డ వద్ద డ్రాప్ చేయాలని కోరింది. అయ్యో పాపం అనుకున్న నంజేగౌడ ఆమెను తన బైక్ పై ఎక్కించుకుని బయలు దేరాడు. ఘాట్ రోడ్డులో కొంతదూరం వెళ్లే సరికి అతనికి అనుమానం వచ్చి ఆమెను ప్రశ్నించాడు.

ఇంతలో వెనుకనే మరో బైక్ పై వచ్చిన రాజేష్. మణికంఠ అనేవార్లు నంజే గౌడ బైక్ కు తమ బైక్ అడ్డంపెట్టి ఆపారు. నంజేగౌడ జేబులో ఉన్న నగదు, మెళ్లో ఉన్న బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. నంజేగౌడ కేకలువేయడంతో స్ధానికులు వచ్చి మణికంఠను పట్టుకున్నారు.లక్ష్మి, రాజేష్ అనేవారు బంగారు గొలుసులతో పరారయ్యారు. మణికంఠను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్ష్మీ,రాజేశ్ ల ఫోన్ నంబర్లు ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు