Woman Dead Body
Hyderabad : హైదరాబాద్ శివారు కోకాపేటలో దారుణం చోటు చేసుకుంది. సెవెన్ హిల్స్ వద్ద గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురయ్యింది. నిర్మానుష్య ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో నార్సింగి పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. మహిళను ఎక్కడో హత్య చేసి.. ఇక్కడకు తీసుకువచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read : South Central Railway : రెండు ప్రత్యేక రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
హత్యకు గురైన మహిళ ఎవరు? చంపిన దుండగులు ఎవరు? అని పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. డాగ్ స్క్వాడ్ ,క్లూస్ టీం సభ్యులు రంగంలోకి దిగారు. మహిళపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.