Mumbai Local Train : ముంబయి లోకల్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు

ముంబయి లోకల్ రైలులో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది.నడుస్తున్న రైలులో 24 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిని ఓ గుర్తుతెలియని వ్యక్తి లైంగికంగా వేధించాడు. పశ్చిమ రైల్వేలోని చర్నిరోడ్- గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు చెప్పారు...

Mumbai Local Train : ముంబయి లోకల్ రైలులో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది.నడుస్తున్న రైలులో 24 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిని ఓ గుర్తుతెలియని వ్యక్తి లైంగికంగా వేధించాడు.(Mumbai Local Train) సంఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత బాధిత మహిళ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ రైల్వేలోని చర్నిరోడ్- గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణ ఘటన జరిగిందని రైల్వే పోలీసులు చెప్పారు. జూన్ 23వతేదీన జరిగిన ఈ సంఘటన ఐదురోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.

Ration Cards : పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు, దేశంలోనే తొలిసారిగా

దీంతో ముంబయి సెంట్రల్ రైల్వే పోలీసులు నిందితుడిపై ఐపీసీ 354 ఎ కింద కేసు నమోదు చేశారు. ఓ మహిళ చర్చ్ గేట్‌కు వెళ్లే రైలు ఎక్కింది. గ్రాంట్ రోడ్ స్టేషనుకు రైలు చేరుకునే ముందు ఓ ఆగంతకుడు మహిళను లైంగికంగా వేధించాడని(Woman Harassed) ఫిర్యాదులో మహిళ పేర్కొంది. మహిళతో అసభ్యంగా సంజ్ఞలు చేసి, రైలు దిగే ముందు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు